ranveer kapoor
-
'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!
ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్, రణ్వీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సోదరిగా తనదైన నటనతో అందరినీ ఆకర్షించింది బుల్లితెర నటి అంజలి ఆనంద్. రణవీర్ సింగ్ సోదరిగా గాయత్రీ రంధవా పాత్రలో కనిపించిన ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) బుల్లితెర నటి అంజలి ఆనంద్ తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు వెల్లడించింది. బాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్ స్కూల్లో చేరినప్పుడు.. తనను శరీర బరువును కించపరిచేలా కొందరు మాట్లాడారని తెలిపింది. తనకు సినిమా ఛాన్స్‌లు రావనీ.. కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎద్దేవా చేశారని వివరించింది. తాను లావుగా ఉన్నందున కొందరు దారుణంగా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది. అంతకుముందు 'ధై కిలో రెమ్','కుల్ఫీ కుమార్ బజేవాలా' వంటి హిట్ టీవీ షోలతో తనదైన ముద్ర వేసింది. "కుల్ఫీ కుమార్ బజేవాలా"లో ప్రధాన పాత్రలో ఆమె తనదైన నటనతో అభిమానులను అలరించింది. కానీ అప్పట్లో ఆ పాత్రకు ప్రశంసల కంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయని తెలిపింది. లావుగా ఉన్న అమ్మాయి లీడ్ రోల్ ఎలా చేస్తుందని.. పలువురు తన క్యారెక్టర్‌ను కించపరిచేలా సందేశాలు పంపారని వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని తెలిపింది. 'లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు? బహుశా ఆమె ఎవరితోనైనా కమిట్ అయినందువల్లే అయి ఉండొచ్చు' అని దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి వెల్లడించింది. అయితే వీటిపై తాను అదేస్థాయిలో స్పందించినట్లు వివరించింది. మనం ఇలాంటి వారి గురించి మాట్లాడటం మూర్ఖత్వమని విమర్శించింది. (ఇది చదవండి: 'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!) కాగా.. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో అంజలి గాయత్రి పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. నటనకు కావాల్సింది టాలెంట్ అని.. శరీర బరువుతో సంబంధం లేదని అంజలి నిరూపించింది. అలా విమర్శలు చేసేవారికి తన నటనతోనే సరైన సమాధానమిచ్చింది. సినిమా ఇండస్ట్రీలో విజయమనేది అంకితభావం, కృషిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. View this post on Instagram A post shared by ✨Anjali Anand✨ (@anjalidineshanand) -
ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మస్త్ర రికార్డ్.. తొలివారం ఎన్ని కోట్లంటే..!
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించింన మూవీ బ్రహ్మస్త్ర-1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దుమ్ము రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలోనే 300 కోట్ల మార్కును దాటింది. ఇండియాలో ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకన్న సందర్భంగా నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. (చదవండి: Alia Bhatt: ఆలియా వేసుకున్న పల్చని డ్రెస్ అన్ని లక్షలా?) ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన నిర్మాత కరణ్ జోహార్ 'ప్రేమ, వెలుగు కలిసి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో రెండోవారంలోకి ప్రవేశిస్తున్నాం' అని వెల్లడించారు. 9/11 వార్షికోత్సవం సందర్భంగా హాలీవుడ్లో పెద్దగా సినిమాలు విడుదల కాకపోవడంతో బ్రహ్మస్త్ర ఊహించిన దానికంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. Love and light ruling the global box office at #1! Entering the second week with a heart full of gratitude and excitement!!✨🔥 #Brahmastra pic.twitter.com/fyJQuVhehL — Karan Johar (@karanjohar) September 16, 2022 -
ఎయిర్‌పోర్ట్‌లో ‘బ్రహ్మస్త్ర’ జంట సర్ప్రైజ్.. ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్
బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ ఆలియా భట్, రణ్వీర్ కపూర్ ముంబైలోని కలీనా ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ప్రత్యేక దుస్తుల్లో వచ్చిన ఈ జంట విమానాశ్రయం బయట ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్రహ్మస్త్ర సినిమా విడుదల తర్వాత తొలిసారిగా విమానాశ్రయంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలియా భట్ పింక్ అనార్కలీ డ్రెస్‌లో ఉండగా.. రణబీర్ కపూర్ తెల్లటి కుర్తా, పైజామాతో పాటు నెహ్రూ జాకెట్‌ను ధరించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫోటోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (చదవండి: Alia Bhatt: ఆలియా వేసుకున్న పల్చని డ్రెస్ అన్ని లక్షలా?) అలియా, రణబీర్‌ల ఫోటోలపై సోషల్ మీడియాలో ఓ అభిమాని స్పందిస్తూ ‘ఆమె చాలా అందంగా ఉంది’అంటూ కామెంట్ చేశాడు. మరో అభిమాని ఏకంగా "రణబీర్ కపూర్ శక్తి కపూర్‌లా ఎందుకు కనిపిస్తున్నాడు?"అని చమత్కరించాడు. 'రణ్వీర్ కపూర్ బన్‌గయా కబీర్ సింగ్' అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు. సెప్టెంబరు 9న విడుదలైన బ్రహ్మస్త్ర బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. -
బ్రహ్మస్త్రపై బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. గొప్ప ప్రయత్నమే.. కానీ..!
బాలీవుడ్ నటి, మోడల్ ఎరికా ఫెర్నాండెజ్ బ్రహ్మస్త్ర సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రయత్నం గొప్పదే.. కానీ సినిమా విజయవంతం కాలేదని వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తప్పుల నుంచి నేర్చుకుంటారని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (చదవండి: Brahmastra Twitter Review: 'బ్రహ్మస్త్ర' 'టాక్ ఏలా ఉందంటే?) ఎరికా ఫెర్నాండెజ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఓ సెషన్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ అభిమాని మీరు బ్రహ్మాస్త్ర సినిమాను చూశారా అన్న ప్రశ్నకు నటి స్పందిస్తూ .. 'అవును, నేను సినిమా చూసాను. ఇది గొప్ప ప్రయత్నం కానీ.. విజయవంతం కాలేదని' రిప్లై ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చింది. అలాగే దర్శకుడు నటీనటులు, కథనంపై మరింత ఫోకస్ పెట్టాల్సిందని సలహా ఇచ్చింది. ఇలాంటి వాటితో ప్రతి ఒక్కరు తమ తప్పుల నుంచి మరింత నేర్చుకుంటారని పేర్కొంది. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని తెలిపింది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
వారివల్లే మెంటల్లీ బరువు తగ్గిపోయింది.. నాగార్జున
‘‘చాలామంది సినిమా చచ్చిపోతోందని అంటున్నారు. కానీ సినిమా పెరుగుతోందనేది నా అభిప్రాయం. అలాగే క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, పోటీ కూడా పెరిగిపోతోంది. ట్రెండ్‌కి తగ్గట్టు యాక్టర్స్, డైరెక్టర్స్ అప్డేట్ అవుతుండాలి. దర్శక–నిర్మాతల మధ్య కథ గురించి లోతైన చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు డిఫరెంట్ కథలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రీగా చూపిస్తామన్నా సినిమాలను చూసేందుకు కొంతమంది ప్రేక్షకులు ఇష్టపడరేమో!’ అన్నారు నాగార్జున. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాలజీ ఫిల్మ్ ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ’ ఈ నెల 9న రిలీజ్ అయ్యింది. దక్షిణాదిలో ‘బ్రహ్మాస్త్రం’గా దర్శకుడు రాజమౌళి సమర్పణలో ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలు నాగార్జున మీడియాతో పంచుకున్నారు.. ‘బ్రహ్మాస్త్రం’లో నా క్యారెక్టర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. అయాన్ ముఖర్జీ నాతో ఏం చెప్పాడో అదే తీశాడు. నా క్యారెక్టర్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. నాకీ సినిమా కథ చెప్పినప్పుడే మూడు భాగాలని చెప్పారు. సెకండ్, థర్డ్ పార్ట్స్‌లో నా పాత్ర ఉంటుందా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. మంచి క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయనే అనుకుంటున్నాను. (చదవండి: కెమెరా ముందు మెరీనా, రోహిత్ ముద్దులు... ‘అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలి’) ఇంట్రవెల్ సీక్వెన్స్ తర్వాత సినిమా కాస్త నెమ్మదించిందేమో! అయితే మిగతా రెండు భాగాలకు లింక్ అయినట్లు కనిపించే ఈ సీన్స్ వల్లే పార్ట్ 2 చూడాలనే కుతూహలం ఆడియన్స్‌లో కలిగింది. నంబర్స్ గురించి ఆలోచించడం మానేశానని ఎన్నోసార్లు చెప్పాను. కానీ అప్డేట్ అవుతూ ఉండాలని మాత్రం తెలుసు. నేను ఆల్మోస్ట్ 38 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇప్పటికీ నా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే అది చాలు నాకు. నాకు మెంటల్లీ బరువు తగ్గిపోయింది. నా నెక్ట్స్ మూవీ ‘ది ఘోస్ట్’ అక్టోబరు 5న విడుదలవుతుంది. ‘గరుడ వేగ’ చూసి, ప్రవీణ్ సత్తారుతో సినిమా చేయాలనుకున్నాను. అది ‘ఘోస్ట్’తో కుదిరింది. ఈ సినిమా కోసం నేను వెపన్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో కొంత శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు బ్రదర్స్, సిస్టర్స్ అండ్ సిస్టర్స్ డాటర్ సెంటిమెంట్ కూడా ఉంది. నా వందో సినిమా కోసం దర్శకుల దగ్గర కథలు వింటున్నాను. కొంచెం ప్రతిష్టాత్మకంగా చేయాలనుకుంటున్నాం. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తర్వాత మళ్లీ ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో అమల యాక్ట్ చేసింది. అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీ, బ్లూ క్రాస్‌లతో అమల బిజీగా ఉండటంతో నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తోంది. ‘ఒకే ఒక జీవితం’ చూసినప్పుడు మా అమ్మగారు గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యాను. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్ అనేది ఇండస్ట్రీపై అంతగా ప్రభావం చూపిస్తోందని నేను అనుకోవడం లేదు. ‘లాల్‌సింగ్ చడ్డా’ ఆడలేదు. కానీ ‘బ్రహ్మాస్త్రం’ ఆడింది. ఈ సినిమా కంటే ముందు వచ్చిన ‘గంగూబాయి కతియావాడి’, ‘భూల్ భులయ్యా 2’, ‘జుగ్ జుగ్ జీయో’ చిత్రాలతో పాటు మన సౌత్ చిత్రాలు రీసెంట్గా ‘కార్తికేయ 2’, గతంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప’ వంటివి హిందీలో బాగానే ఆడాయి.సినిమా బాగుంటే ఆడుతుంది. అలాగే ఏ ఇండస్ట్రీ వారు మరో ఇండస్ట్రీ వారిని సర్ప్రైజ్ చేయడం అనేది సాధ్యపడదని నా ఫీలింగ్. ఒకప్పుడు మనల్ని మద్రాసి అనేవారు. ఇప్పుడది పోయింది. -
స్టేడియంలో సందడి చేసిన రణవీర్ సింగ్.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా
ఐపీఎల్-2022లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ముంబై ఇండియన్స్ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్లో 9 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ డానియల్ సామ్స్ చేతికి బంతి అందించాడు. అయితే రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతూ.. 9పరుగులను డిఫెండ్ చేసి సామ్స్ ముంబైకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక బ్రబౌర్న్ ముంబైకు హోం గ్రౌండ్ కావడంతో స్టేడియం అభిమానులతో నిండిపోయింది. ముంబై జట్టుకు సపోర్ట్ చేస్తూ అరుపులు కేకలతో హోరెత్తించారు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ బ్రబౌర్న్ స్టేడియంలో సందడి చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ముంబై జట్టును రణవీర్ సింగ్ ఊత్సహపరిచాడు. ఆ జట్టు బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి చప్పట్లు కొడుతూ రణవీర్ కనిపించాడు. ఇక అఖరి ఓవర్లో ముంబై జట్టు విజయం సాధించగానే రణవీర్ సింగ్ వైల్డ్ సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: 'అతడిని భారత జట్టుకు ఎంపిక చేయండి.. బుమ్రాకు సరైన జోడి' What a Match ! Come On Let's Finish on Good Note 😌.#MumbaiIndians #RanveerSingh pic.twitter.com/tbuZTpPE7v — iamnaved18 (@Navedkamil1) May 6, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న దీపిక!
-
జాన్వీ@టెంపర్
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. శషాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో జోడీ కట్టారు జాన్వీ. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో క్రేజీ ఆఫర్ జాన్వీని వరించిందని బీ టౌన్ టాక్. ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని ‘శింబా’ పేరుతో హిందీలో రీమేక్ చేయనున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ చిత్రం నిర్మించనున్నారట. ఇందులో జాన్వీ కపూర్‌ని కథానాయికగా తీసుకున్నారని బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తెలుగులో కాజల్ చేసిన పాత్రకంటే ‘శింబా’లో జాన్వీ పాత్రను మరింత క్యూట్‌గా మలచనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. జాన్వీ ఫస్ట్ మూవీ ‘ధడక్’ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ‘టెంపర్’ రీమేక్‌కి కూడా ఆయనే నిర్మాత. ఒకవేళ జాన్వీ నటన నచ్చి, ‘టెంపర్’కి కూడా తీసుకోవాలనుకున్నారేమో? అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. -
ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది.. ట్వీట్ల దుమారం!
సంజయ్‌లీలా భన్సాలీ తాజా దృశ్యకావ్యం 'పద్మావతి' సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రేమజంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ మధ్య ఏదో విభేదాలు పొడసూపాయన్న వార్తలు బాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. బాలీవుడ్ లవ్‌బర్డ్స్‌గా ముద్రపడిన రణ్వీర్-దీపిక మధ్య అంత సవ్యంగా లేదట. తన లవ్లేడీ దీపిక తీరుతో రణ్వీర్ తీవ్రంగా నోచ్చుకున్నాడని తెలుస్తోంది. 2013లో ఈ జంట భన్సాలీ 'గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా' సినిమాతో అలరించారు. అప్పటినుంచి వీరు డేటింగ్ చేస్తున్నట్టు కథనాలు గుప్పుమన్నాయి. తాము ప్రేమలో ఉన్నామని ఈ జంట ఏనాడూ మీడియాముఖంగా చెప్పిందీ లేదు. కానీ, జంటగా కనిపిస్తూ.. సినీ వేడుకలకు హాజరవుతూ.. సన్నిహితంగా పార్టీలకు వెళుతూ.. తమ ప్రేమను అనేకసార్లు వీరు చాటుకున్నారు. వీరి మధ్య ఉన్న ఈ కెమిస్ట్రీయే భన్సాలీ తీసిన 'బాజీరావు మస్తానీ' సినిమాలోనూ వ్యక్తమైంది. ప్రేమలో మునిగిపోతున్నట్టు భావిస్తున్న ఈ జంట మధ్య తాజాగా విభేదాలు రావడానికి కారణం.. 'పద్మావతి' త్రీడీ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక. రెండురోజుల కిందట జరిగిన ఈ వేడుకకు దీపిక కళ్లుచెదిరేరీతిలో జిగేల్ మనేలా హాజరైంది. ఆమె హాజరు ఈ వేడుకకు వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. కారణం ఈ వేడుక అతిథుల జాబితాలో ఆమె పేరు లేకపోవడమే. అయినా అనూహ్యంగా ఆమె రావడం.. అదే సమయంలో ఈ చిత్రంలో ఇతర ప్రధాన నటులైన రణ్వీర్, షాహిద్ కపూర్ రాకపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. 3డీ ట్రైలర్ లాంచ్ వేడుకకు దీపిక ఒంటరిగా హాజరుకావడం.. ఆమె సహ నటులు రణ్వీర్, షాహిద్‌లకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. తాము తీరికతోనే ఉన్నా.. తమకు సమాచారం ఇవ్వకుండా దీపిక ఒంటరిగా వెళ్లడంతో వారికి పుండు మీద కారం చల్లినట్టు అయిందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా 'పద్మావతి' ట్రైలర్ విడుదలైన నాటినుంచి అల్లావుద్దీన్ ఖిల్జీగా నటించిన రణ్‌వీర్‌కు విశేషమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది కూడా దీపికలో అభద్రతాభావాన్ని నింపిందని, అందుకే ఆమె సహ నటులకు మాటమాత్రమైన చెప్పకుండా ఒంటరిగా 3డీలాంచ్ వేడుకకు వెళ్లి హల్చల్ చేసిందని ఆ వర్గాలు అంటున్నాయి. 'పద్మావతి'లో దీపిక టైటిల్ రోల్ పోషించినా.. రణ్వీర్, షాహిద్‌లకు వచ్చినంత పేరుప్రఖ్యాతలు, ప్రశంసలు దీపికకు రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్ అయిన తనకే టోకరా ఇచ్చి దీపిక ఒంటరిగా వెళ్లడం రణ్‌వీర్‌కు షాక్‌కు గురిచేసిందట. దీంతో కోపోద్రిక్తుడైన రణ్వీర్.. తన పర్సనల్ టీమ్‌ను తీసిపారేయడమేకాకుండా.. అప్పటినుంచి దీపికతో మాట్లాడటం లేదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ వేడుక తర్వాత రణ్వీర్ పెట్టిన నిగూఢమైన ట్వీట్స్ సైతం ఇదే విషయాన్ని చాటుతుండటం గమనార్హం. మొదటి ట్వీట్లో పద్మావతి 3డీ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, 3డీలో తనను తాను చూసుకోవడం అద్భుతంగా ఉందని పేర్కొన్న రణ్వీర్.. అనంతరం తొలిసారి తనను ఒక తేనేటీగ కుట్టిందని, ఆ ఫొటో పెడితే.. ఆ తేనేటీగ ఫేమస్ అవుతుందని పెట్టడం లేదని ట్వీట్ చేశాడు. ఇక మిగిలిన తన జీవితంలో ఇదే తొలిరోజు అని, ఇప్పటివరకు జరిగినదానితో విసిగిపోయానని రణ్వీర్ పేర్కొన్నాడు. దీపికపై కోపంతోనే.. ఆమెను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ ట్వీట్లు చేశాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. Saw #Padmavati 3D trailer last night! Holy smokes! It was jaw-dropping! Also 1st time I'm seeing myself in 3D so..! Hahaa! Pretty badass 😂🤙🏾 — Ranveer Singh (@RanveerOfficial) October 31, 2017 Also stung by a Bee 4 the 1st time earlier today🐝thought Id post a picture but then I was like I dont wanna make that Bee famoussss haha😂🤙🏾 — Ranveer Singh (@RanveerOfficial) October 31, 2017 In other firsts, it's also the first day of the rest of my Life. Ok, now I'm done. — Ranveer Singh (@RanveerOfficial) October 31, 2017 -
డబ్‌స్మాష్‌తో స్మాష్ చేసిన మెగాస్టార్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మొట్ట మొదటి సారిగా డబ్స్మాష్ వీడియోతో సంచలనం సృష్టించారు. తన అద్భుతమైన గాత్రంతో మరోసారి మ్యాజిక్ చేశారు. హీరో కోసం చేసిన డబ్స్మాష్ వీడియో.. నెటిజన్లను కట్టిపడేస్తోంది. అమితాబ్ చేస్తున్న 'ఆజ్ కీ రాత్ హై జిందగీ' టెలివిజన్ షో సెట్లో తన కోసం డబ్ స్మాష్ చేయాలని రణవీర్ అడగ్గానే ఓకే చెప్పేశారు బిగ్ బి. దీంతో రణవీర్ తెగ సంబరపడిపోతున్నాడు. వెంటనే బాజీరావు మస్తానీ సినిమా కోసం తామిద్దరం కలిసి చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లెజెండ్, బిగ్ బి నాకోసం డబ్స్మాష్ చేశారు... ఇపుడు ఇదే పెద్ద పురాణ గాధ.. అంటూ రణవీర్ ట్వీట్ చేశాడు. బాజీరావు మస్తానీ మూవీ డైలాగ్‌తో కూడిన ఈ వీడియో ఇపుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. బాజీరావు నే మస్తానీ సే ప్యార్ కీ హై అయ్యాషీ నహీ.. అంటూ సాగే ఈ 6 సెకన్ల వీడియో ఇపుడు వైరల్ అయింది. కాగా 17వ శతాబ్దపు మరాఠా సామ్రాజ్యపు అధినేత బాజీరావు చరిత్ర ఆధారంగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలీ రూపొందిస్తున్న హిస్టారికల్ మూవీ బాజీరావు మస్తానీ. ఓటమి ఎరుగని మరాఠా యోధుడు బాజీరావుగా రణవీర్ సింగ్, మస్తానీగా దీపిక, కాశీభాయ్గా ప్రియాంక నటించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ కూడా అంచనాలను మరింతగా పెంచేసింది. అదిరిపోయే యుద్ధ సన్నివేశాలతో భన్సాలీ వెండితరపై అద్భుతంగా మలుస్తున్న ఈ మూవీ డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. Now this .. is Epic !!! :))) the Biggest 'B' of all @SrBachchan #BajiraoMastani pic.twitter.com/AUhO1OJslC — Ranveer Singh (@RanveerOfficial) November 25, 2015 -
ఒక్కపైసా తీసుకోకుండా ఆ సినిమా చేశాడా!
'బాజీరావు మస్తానీ'.. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే అత్యంత భారీ సినిమా. ఆయన ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత కఠినమైన పాత్ర ఇదే అవుతుందని భావిస్తున్నారు. దర్శకుడు సంజయ్‌లీలా భన్సలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలో టైటిల్ రోల్ బాజీరావు పాత్రను రణ్వీర్ సింగ్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా దూసుకుపోతున్నది. మరాఠా సామ్రాజ్య వైభవానికి వెండితెర దృశ్యరూపంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి మరో వార్త తాజాగా హల్చల్ చేస్తున్నది. ఈ సినిమా కోసం ఒక్క రూపాయి పారితోషికం కూడా రణ్వీర్ సింగ్ తీసుకోలేదట. నిర్మాతల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా రణ్వీర్ ఈ పాత్ర పోషించారని, పారితోషికానికి బదులు ఆయన సినిమా లాభాల్లో వాటా తీసుకోవడానికి మొగ్గు చూపారని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అత్యంత భారీతనంతో, చారిత్రక ప్రేమకథగా రూపొందిన 'బాజీరావు మస్తానీ' బడ్జెట్ రూ. 130 కోట్లకుపైనని తెలుస్తున్నది. నిజానికి ఇటీవల చాలామంది బాలీవుడ్ నటులు పారితోషికానికి బదులు సినిమా లాభాల్లో వాటాలకే ప్రాధాన్యమిస్తున్నారు. హీరోలు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్దేవగణ్తోపాటు హీరోయిన్లు దీపికా పదుకొణే, ఐశ్వర్యరాయ్ సైతం ఇదే పంథాను అనుసరించారు. -
భన్సాలీ మ్యాజిక్ ఆఫ్ 'మస్తానీ'!
చారిత్రాత్మక ప్రణయగాథ 'బాజీరావు మస్తానీ'. మరాఠా యోధుడు బాజీరావు పీష్వా, ఆయన ప్రియురాలు మస్తానీ మధ్య సాగిన ప్రేమకథను అత్యంత భారీస్థాయిలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా 'ట్రైలర్' అద్భుతంగా ఉండి.. చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరాఠా సామ్రాజ్య వైభవం వెండితెర దృశ్యరూపంగా భన్సాలీ ఈ సినిమాను మలిచారు. ఇందులో రణ్వీర్ సింగ్ బాజీరావు రాజసంతో కనిపిస్తుండగా, ఆయన భార్య కాశీబాయిగా అమాయకత్వం, భావోద్వేగం మేళవించిన పాత్రలో ప్రియాంకచోప్రా నటించారు. బాజీరావు ప్రియారాలి మస్తానీగా దీపికా పదుకొణె అడుగడుగునా తన అందంతో మెరిసిపోయింది. మూడు నిమిషాల నిడివిగల ఈ సినిమా ట్రైలర్లో అడుగడుగునా భన్సాలీ భారీతనాన్ని చూడవచ్చు. వచ్చే ఈ నెల 18న సినిమా ప్రేక్షకులను పలుకరించనుంది. -
బాలీవుడ్లో టెంపర్ టెంపరేచర్