ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్, రణ్‌వీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ సోదరిగా తనదైన నటనతో అందరినీ ఆకర్షించింది బుల్లితెర నటి అంజలి ఆనంద్. రణవీర్ సింగ్ సోదరిగా గాయత్రీ రంధవా పాత్రలో కనిపించిన ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.
(ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!)
బుల్లితెర నటి అంజలి ఆనంద్ తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు వెల్లడించింది. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్ స్కూల్‌లో చేరినప్పుడు.. తనను శరీర బరువును కించపరిచేలా కొందరు మాట్లాడారని తెలిపింది. తనకు సినిమా ఛాన్స్‌లు రావనీ.. కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎద్దేవా చేశారని వివరించింది. తాను లావుగా ఉన్నందున కొందరు దారుణంగా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది.
అంతకుముందు 'ధై కిలో రెమ్','కుల్ఫీ కుమార్ బజేవాలా' వంటి హిట్ టీవీ షోలతో తనదైన ముద్ర వేసింది. "కుల్ఫీ కుమార్ బజేవాలా"లో ప్రధాన పాత్రలో ఆమె తనదైన నటనతో అభిమానులను అలరించింది. కానీ అప్పట్లో ఆ పాత్రకు ప్రశంసల కంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయని తెలిపింది. లావుగా ఉన్న అమ్మాయి లీడ్ రోల్ ఎలా చేస్తుందని.. పలువురు తన క్యారెక్టర్‌ను కించపరిచేలా సందేశాలు పంపారని వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని తెలిపింది.
'లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు? బహుశా ఆమె ఎవరితోనైనా కమిట్ అయినందువల్లే అయి ఉండొచ్చు' అని దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి వెల్లడించింది. అయితే వీటిపై తాను అదేస్థాయిలో స్పందించినట్లు వివరించింది. మనం ఇలాంటి వారి గురించి మాట్లాడటం మూర్ఖత్వమని విమర్శించింది.
(ఇది చదవండి: 'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!)
కాగా.. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో అంజలి గాయత్రి పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. నటనకు కావాల్సింది టాలెంట్ అని.. శరీర బరువుతో సంబంధం లేదని అంజలి నిరూపించింది. అలా విమర్శలు చేసేవారికి తన నటనతోనే సరైన సమాధానమిచ్చింది. సినిమా ఇండస్ట్రీలో విజయమనేది అంకితభావం, కృషిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment