New Mom Debina Bonnerjee Says Trolls Call Her Mini Haathi - Sakshi
Sakshi News home page

Debina Bonnerjee: చిన్న ఏనుగు అంటూ బాడీ షేమింగ్‌: డెబినా బోనర్జీ

Published Thu, Jul 13 2023 1:04 PM | Last Updated on Thu, Jul 13 2023 1:35 PM

New Mom Debina Bonnerjee Says Trolls Call Her Mini Haathi - Sakshi

బాలీవుడ్ బుల్లితెర నటి డెబినా బోనర్జీ  ప్రస్తుతం మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. గతేడాది నవంబర్‌లో రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామ నటుడు గుర్మీత్ చౌదరి ప్రేమ వివాహాం చేసుకుంది. తెలుగులోనూ అమ్మాయిలు- అబ్బాయిలు చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా జగపతిబాబు మూవీ సిక్స్ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌లో కనిపించింది. 

ఏప్రిల్ 2022లో మొదటి బిడ్డ జన్మించగా.. మరో ఏడు నెలల్లోనే రెండో బిడ్డకు తల్లయ్యింది. అయితే తన యూట్యూబ్ వ్లాగ్స్‌లో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా చేసిన వ్లాగ్స్‌లో తాను బాడీ షేమింగ్‌కు గురైనట్లు చెప్పుకొచ్చింది డెబినా బెనర్జీ. తన శరీర బరువు పట్ల విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని తెలిపింది. నెటిజన్స్ చాలా మంది తనను "మినీ హాతీ"(చిన్న ఏనుగు) కామెంట్స్ చేస్తున్నారని చెప్పింది. అయితే నేను వాటిని పట్టించుకోనని చెబుతోంది. త్వరలోనే బికిినీ ధరించి మీ ముందుకొస్తానని అంటోంది. 

(ఇది చదవండి: చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!)

డెబినా మాట్లాడుతూ.. 'సమాజం మిమ్మల్ని ద్వేషించినప్పుడు వాటిని సానుకూలంగా తీసుకోవాలి. అప్పుడే మరింత ఉత్తమంగా పని చేస్తారు. ప్రస్తుతం నేను చాలా లావుగా ఉన్నా. తగ్గడం చాలా కష్టమైన పనే కానీ నేను ప్రయత్నిస్తాను. నాపై ట్రోల్స్ వచ్చినా పర్లేదు. ఇంకా వాటి నుంచి నేను మరింత ప్రేరణ పొందుతా.' అని పేర్కొంది.

కాగా.. 'రామాయణం' సీరియల్‌లో డెబినా సీతగా నటించింది.  రాముడి పాత్రలో గుర్మీత్ కనిపించారు. ఆ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15, 2011న వివాహం చేసుకున్నారు. దాదాపు పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులయ్యారు. 

(ఇది చదవండి: హీరో విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement