anjali anand
-
'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!
ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్, రణ్వీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సోదరిగా తనదైన నటనతో అందరినీ ఆకర్షించింది బుల్లితెర నటి అంజలి ఆనంద్. రణవీర్ సింగ్ సోదరిగా గాయత్రీ రంధవా పాత్రలో కనిపించిన ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) బుల్లితెర నటి అంజలి ఆనంద్ తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు వెల్లడించింది. బాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్ స్కూల్లో చేరినప్పుడు.. తనను శరీర బరువును కించపరిచేలా కొందరు మాట్లాడారని తెలిపింది. తనకు సినిమా ఛాన్స్‌లు రావనీ.. కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎద్దేవా చేశారని వివరించింది. తాను లావుగా ఉన్నందున కొందరు దారుణంగా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది. అంతకుముందు 'ధై కిలో రెమ్','కుల్ఫీ కుమార్ బజేవాలా' వంటి హిట్ టీవీ షోలతో తనదైన ముద్ర వేసింది. "కుల్ఫీ కుమార్ బజేవాలా"లో ప్రధాన పాత్రలో ఆమె తనదైన నటనతో అభిమానులను అలరించింది. కానీ అప్పట్లో ఆ పాత్రకు ప్రశంసల కంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయని తెలిపింది. లావుగా ఉన్న అమ్మాయి లీడ్ రోల్ ఎలా చేస్తుందని.. పలువురు తన క్యారెక్టర్‌ను కించపరిచేలా సందేశాలు పంపారని వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని తెలిపింది. 'లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు? బహుశా ఆమె ఎవరితోనైనా కమిట్ అయినందువల్లే అయి ఉండొచ్చు' అని దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి వెల్లడించింది. అయితే వీటిపై తాను అదేస్థాయిలో స్పందించినట్లు వివరించింది. మనం ఇలాంటి వారి గురించి మాట్లాడటం మూర్ఖత్వమని విమర్శించింది. (ఇది చదవండి: 'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!) కాగా.. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో అంజలి గాయత్రి పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. నటనకు కావాల్సింది టాలెంట్ అని.. శరీర బరువుతో సంబంధం లేదని అంజలి నిరూపించింది. అలా విమర్శలు చేసేవారికి తన నటనతోనే సరైన సమాధానమిచ్చింది. సినిమా ఇండస్ట్రీలో విజయమనేది అంకితభావం, కృషిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. View this post on Instagram A post shared by ✨Anjali Anand✨ (@anjalidineshanand) -
‘లావుగా ఉన్నావ్.. జిమ్‌కు వెళ్లు’
బాడీ షేమింగ్.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాట. కొద్ది రోజుల క్రితం విద్యాబాలన్ దీని మీద ఓ వీడియో కూడా చేశారు. సాధరణ వ్యక్తులతో పోలిస్తే.. సెలబ్రిటీల విషయంలో బాడీ షేమింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి కామెంట్సే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటి అంజలి ఆనంద్. అయితే కామెంట్ చేసిన వ్యక్తికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అంజలి. వివరాలు.. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో అంజలి తన అభిమానులతో ముచ్చటించారు. ఆ సమయంలో ఓ మహిళ అంజలిని ఉద్దేశిస్తూ.. ‘మీరు చాలా లావుగా ఉన్నారు.. జిమ్‌కు వెళ్తే బాగుంటుంది’ అని అంజలికి ఓ ఉచిత సలహా ఇచ్చింది. ఈ కామెంట్లపై అంజలి చాలా హుందాగా స్పందించారు. ‘నేను కూడా ప్రజలను సరైన దారిలో నడిపించడానికి.. లేదా వారు వ్యాప్తి చేసే ద్వేషం గురించి వారిని హెచ్చరించడానికి సోషల్ మీడియాను వాడతానని ఎన్నడు అనుకోలేదు. నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తేనే జనాలకు ఓ ఉదాహరణగా నిలవగలుగుతాను. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తే.. నేను సిద్ధమే. వాటి గురించి మాట్లాడతాను.. చర్చిస్తాను. ఎందుకంటే విమర్శించే వారిలోనే సమస్య కానీ నాలో ఏలాంటి సమస్య లేదు. అలాంటి వారి పట్ల చాలా ప్రేమగా, దయగా వ్యవహరించి చంపేస్తాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అంజలి. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరెక్ట్‌గా డీల్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అంజలి ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ధాయ్ కిలో ప్రేమ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. -
ఆ నటి బరువు 108: ఇంకా బరువు పెరగాలట!
ఆమె బరువు 108 కిలోలు.. అయినా, తమ టీవీషో కోసం మరింత బరువు పెరుగాలని నిర్వాహకులు సూచించారు. వారికి ఆమె సింపుల్ గా నో చెప్పింది. ఇది అంజలీ ఆనంద్‌కు ఎదురైన అనుభవం. ప్రముఖ చానెల్ స్టార్‌ప్లస్‌లో త్వరలో ప్రసారమయ్యే ’డాయి కిలో ప్రేమ్’ అనే టీవీ షోతో ఆమె తొలిసారి ప్రేక్షకులను పలుకరించబోతున్నది. అధిక బరువున్న అమ్మాయిగా ఈ షోలో నటిస్తున్నది. ఇప్పటికే ఆమె 108 కిలోల బరువు ఉండగా.. నిర్వాహకులు మరింత బరువు పెరగాలని, అప్పుడే షో కోసం బాగుంటుందని కోరారు. అయితే, వారి అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ‘నేను ఇప్పటివరకు ఎంతో చురుగ్గా జీవించాను. నాకు ట్రెక్కింగ్, సైక్లింగ్ ఇష్టం. నిలకడైన బరువును పాటించాను. ఇప్పుడు ఒక్కసారిగా బరువు పెరగమంటే నేను గట్టిగా నో అనే చెప్తాను. నేను ప్రస్తుతం 108 కిలోల బరువు ఉన్నాను. ఇంకా బరువు పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చు’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొంది. డాయి కిలో ప్రేమ్’ ఏప్రిల్ 3 నుంచి స్టార్ ప్లస్ లో ప్రసారం కానుంది. ఈ షోలో అంజలి సరసన నటిస్తున్న మెహెర్జాన్ మజ్దా కూడా 16 కిలోల బరువు పెరిగాడు. -
ఇంకో కేజీ పెరిగినా నాకు కష్టాలే: నటి
ముంబయి: ఇప్పటికే అధిక బరువు ఉన్నానని, ఇంతకంటే ఒక్క కేజీ కూడా పెరగబోనని టీవీ నటి అంజలి ఆనంద్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె బరువు 108 కేజీలు. త్వరలో ‘దాయి కిలో ప్రేమ్’ అనే మరో టీవీ ప్రోగ్రాం ప్రారంభంకానుంది. దీనికోసం ప్రస్తుతం ఉన్న బరువుకంటే అదనంగా పెరగాలని ఈ ప్రోగ్రాం నిర్మాతలు అంజలిని కోరగా అందుకు ఆమె ససేమిరా అని చెప్పేసింది. ‘నేను ఇంత బరువున్నప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉంటాను. ఇతరుల మాదిరిగానే ట్రెక్కింగ్, సైక్లింగ్లాంటివి చేస్తుంటాను. ప్రస్తుతం నా పాత్ర కోసం 108కేజీల బరువు పెరిగాను. ఇంతకంటే ఏ మాత్రం పెరిగినా నేను క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పరిస్థితి తారుమారవుతుంది. అందుకే నేనిక ఏ మాత్రం పెరగను’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈమె స్టార్ ప్లస్ టీవీ చానెల్లో వచ్చే టీవీ షోలో నటిస్తోంది.