
బాడీ షేమింగ్.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాట. కొద్ది రోజుల క్రితం విద్యాబాలన్ దీని మీద ఓ వీడియో కూడా చేశారు. సాధరణ వ్యక్తులతో పోలిస్తే.. సెలబ్రిటీల విషయంలో బాడీ షేమింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి కామెంట్సే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటి అంజలి ఆనంద్. అయితే కామెంట్ చేసిన వ్యక్తికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అంజలి. వివరాలు.. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో అంజలి తన అభిమానులతో ముచ్చటించారు. ఆ సమయంలో ఓ మహిళ అంజలిని ఉద్దేశిస్తూ.. ‘మీరు చాలా లావుగా ఉన్నారు.. జిమ్‌కు వెళ్తే బాగుంటుంది’ అని అంజలికి ఓ ఉచిత సలహా ఇచ్చింది. ఈ కామెంట్లపై అంజలి చాలా హుందాగా స్పందించారు.
‘నేను కూడా ప్రజలను సరైన దారిలో నడిపించడానికి.. లేదా వారు వ్యాప్తి చేసే ద్వేషం గురించి వారిని హెచ్చరించడానికి సోషల్ మీడియాను వాడతానని ఎన్నడు అనుకోలేదు. నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తేనే జనాలకు ఓ ఉదాహరణగా నిలవగలుగుతాను. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తే.. నేను సిద్ధమే. వాటి గురించి మాట్లాడతాను.. చర్చిస్తాను. ఎందుకంటే విమర్శించే వారిలోనే సమస్య కానీ నాలో ఏలాంటి సమస్య లేదు. అలాంటి వారి పట్ల చాలా ప్రేమగా, దయగా వ్యవహరించి చంపేస్తాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అంజలి. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరెక్ట్‌గా డీల్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అంజలి ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ధాయ్ కిలో ప్రేమ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment