Anasuya Strong Reply To Netizens Body Shaming Trolls On Her, Video Viral - Sakshi
Sakshi News home page

Trolls On Anasuya: 'అది మీ దిగజారుడుతనం.. అలాంటి వీడియోలు పెడతారా'?

Published Fri, Dec 24 2021 4:35 PM | Last Updated on Fri, Dec 24 2021 4:51 PM

Anasuya Strong Reply To Netizens Body Shaming Trolls On Her, Video Viral - Sakshi

Anasuya Strong Reply To Netizens Body Shaming Trolls On Her, Video Viral: యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. బుల్లితెరపై గ్లామరస్‌ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ పాత్ర నచ్చితే అది గ్లామరైన, డీగ్లామరైన సై అంటుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో కనిపించింది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో తనపై చేస్తున్న ట్రోలింగ్‌పై అనసూయ ఘాటుగా స్పందించిది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చిన అనసూయ తనపై యూట్యూబ్‌లో అసభ్యకరంగా థంబ్‌నెయిల్స​ పెడుతున్నారంటూ మండిపడింది. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ పెట్టే థంబ్‌ నెయిల్స్‌ చూశాను. ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్‌ అవుతారు అంటూ పెడుతుంటారు. ఇలాంటివి పట్టించుకోవద్దని అనుకుంటాను. కానీ అన్ని సందర్బాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి.

ఇక నేను బరువు పెరగడం లేదా తగ్గడం అన్నది నా ఇష్టం. కానీ మీ దిగజారుడుతనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను ఆ కామెంట్స్ చేసేవాళ్లని అడుగుతున్నా. నేను కూడా మీలా మాట్లాడగలను. హర్ట్ చేయగలను కానీ అది నా వ్యక్తిత్వం కాదు చురకలంటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement