
బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ ఆలియా భట్, రణ్‌వీర్ కపూర్ ముంబైలోని కలీనా ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ప్రత్యేక దుస్తుల్లో వచ్చిన ఈ జంట విమానాశ్రయం బయట ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్రహ్మస్త్ర సినిమా విడుదల తర్వాత తొలిసారిగా విమానాశ్రయంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలియా భట్ పింక్ అనార్కలీ డ్రెస్‌లో ఉండగా.. రణబీర్ కపూర్ తెల్లటి కుర్తా, పైజామాతో పాటు నెహ్రూ జాకెట్‌ను ధరించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫోటోలు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
(చదవండి: Alia Bhatt: ఆలియా వేసుకున్న పల్చని డ్రెస్ అన్ని లక్షలా?)
అలియా, రణబీర్‌ల ఫోటోలపై సోషల్ మీడియాలో ఓ అభిమాని స్పందిస్తూ ‘ఆమె చాలా అందంగా ఉంది’అంటూ కామెంట్ చేశాడు. మరో అభిమాని ఏకంగా "రణబీర్ కపూర్ శక్తి కపూర్‌లా ఎందుకు కనిపిస్తున్నాడు?"అని చమత్కరించాడు. 'రణ్‌వీర్ కపూర్ బన్‌గయా కబీర్ సింగ్' అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు. సెప్టెంబరు 9న విడుదలైన బ్రహ్మస్త్ర బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment