ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా బాలీవుడ్‌లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదట ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు.
( చదవండి: ఓటీటీకి 'బ్రహ్మస్త్ర' .. అప్పుడేనా?)
అయితే ఈ సినిమా కలెక్షన్లపై కాస్త గందరగోళం ఏర్పడింది. తాజాగా ఈ మూవీ సాధించిన కలెక్షన్లపై దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఇన్‌స్టాలో రాస్తూ ' 2022లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్‌గా నిలిచిన హిందీ మూవీ. ఇందుకు మీ అందరికి ధన్యవాదాలు. హ్యాపీ నవమి' అంటూ క్యాప్షన్‌తో కలెక్షన్ల వివరాలతో ఓ కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో బ్రహ్మాస్త్ర రూ.425 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని పోస్టర్‌లో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భూల్ భులయ్యా 2, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాల కలెక్షన్ల కంటే ఎక్కువ మొత్తం బ్రహ్మాస్త్రకు వచ్చినట్లు అయాన్ వెల్లడించాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బడ్జెట్ అనూహ్యంగా పెరిగినట్లు చెప్పారు అయాన్ ముఖర్జీ.
Comments
Please login to add a commentAdd a comment