Rumours On Brahmastra Movie OTT Release Date, Details Inside - Sakshi
Sakshi News home page

Brahmastra Movie OTT Release: బ్రహ్మస్త్రపై ఓటీటీ టాక్‌.. అందులో నిజమెంత?

Published Wed, Sep 28 2022 7:38 PM | Last Updated on Wed, Sep 28 2022 8:17 PM

Brahmastra Movie OTT Release Talk Running It Comes In October - Sakshi

బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు.  భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

(చదవండి: దసరా సెలవుల‍్లో బ్రహ్మస్త్ర బంపర్‌ ఆఫర్‌.. థియేటర్లలో రూ.100 కే చూడొచ్చు)

తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై టాక్ నడుస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌లోనే  స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం. అక్టోబర్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  అదే నిజమైతే బ్రహ్మస్త్రను చూడాలనుకుంటున్న అభిమానులకు పండగే. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ+హాట్ స్టార్  సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement