ఐపీఎల్-2022లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ముంబై ఇండియన్స్ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్‌లో 9 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ డానియల్ సామ్స్ చేతికి బంతి అందించాడు. అయితే రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతూ.. 9పరుగులను డిఫెండ్ చేసి సామ్స్ ముంబైకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక బ్రబౌర్న్ ముంబైకు హోం గ్రౌండ్ కావడంతో స్టేడియం అభిమానులతో నిండిపోయింది.
ముంబై జట్టుకు సపోర్ట్ చేస్తూ అరుపులు కేకలతో హోరెత్తించారు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ బ్రబౌర్న్ స్టేడియంలో సందడి చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ముంబై జట్టును రణవీర్ సింగ్ ఊత్సహపరిచాడు. ఆ జట్టు బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి చప్పట్లు కొడుతూ రణవీర్ కనిపించాడు. ఇక అఖరి ఓవర్‌లో ముంబై జట్టు విజయం సాధించగానే రణవీర్ సింగ్ వైల్డ్ సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2022: 'అతడిని భారత జట్టుకు ఎంపిక చేయండి.. బుమ్రాకు సరైన జోడి'
What a Match !
— iamnaved18 (@Navedkamil1) May 6, 2022
Come On Let's Finish on Good Note 😌.#MumbaiIndians #RanveerSingh pic.twitter.com/tbuZTpPE7v
Comments
Please login to add a commentAdd a comment