ప్రతి ఒక్కడికీ కత్రినాకైఫ్‌ కావాలి.. కానీ! | Rakul Preet Singh Dubsmash For Chi La Sow Movie Promotion | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కడికీ కత్రినాకైఫ్‌ కావాలి : రకుల్‌

Published Thu, Jul 19 2018 7:36 PM | Last Updated on Thu, Jul 19 2018 7:53 PM

Rakul Preet Singh Dubsmash For Chi La Sow Movie Promotion - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

హైదరాబాద్‌ : ‘ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్‌ కావాలి.. కానీ ఎవ్వడూ రణ్‌బీర్‌లా ఉండడు’ అంటూ టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పోస్ట్‌ చేశారు. అదేంటీ రకుల్‌ను ఎవరైనా హర్ట్‌ చేశారా అనుకుంటున్నారా. అదేం లేదండీ.. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘చి ల సౌ’  మూవీ ప్రమోషన్‌లో భాగంగా నటి రకుల్‌ ఓ డైలాగ్‌ను డబ్‌స్మాష్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్‌ పోస్ట్‌ చేసిన ఆ డబ్‌స్మాష్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

రిలీజ్‌కు ముందే మూవీ చూడాలని ఉందా!
హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ‘చి ల సౌ’  సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ‘ఇక్కడ నా ఫెవరెట్‌ డైలాగ్‌ ఉంది. అమ్మాయిలు ఏమంటారు. మీరు విడుదలకు ముందే ఆ చిత్రాన్ని చూడాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డబ్‌స్మాష్‌ వీడియోలను FunWithChiLaSow హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేయండి. మూవీ యూనిట్‌తో కలిసి సినిమా చూసే చాన్స్‌ రావచ్చు’ అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రకుల్‌ చేసిన పోస్టుకు భారీగా స్పందన వస్తోంది. అయితే కొందరు మాత్రం రకుల్‌ మీరు గతంలోలాగ చబ్బీగా లేరు.. డైటింగ్‌ తగ్గించి మళ్లీ బొద్దుగా తయారవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

సుశాంత్‌ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్‌ పతాకంపై జస్వంత్‌ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి ల సౌ’.. ఈ మూవీ ద్వారా నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుశాంత్‌కు జోడీగా రుహాని శర్మ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై మూవీ యూనిట్‌ ధీమాగా ఉంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement