టిక్‌ టాక్‌ వీడియో కేసులో ఇద్దరు అరెస్టు | Chennai Youth Arrest in Tic Toc Videos in Police Station Viral | Sakshi
Sakshi News home page

టిక్‌ టాక్‌ వీడియో కేసులో ఇద్దరు అరెస్టు

Feb 8 2019 11:47 AM | Updated on Feb 8 2019 11:47 AM

Chennai Youth Arrest in Tic Toc Videos in Police Station Viral  - Sakshi

చెన్నై ,తిరువొత్తియూరు: పోలీసుస్టేషన్‌ ముందు నిలబడి టిక్‌టాక్‌ వీడియో తీసి విడుదల చేసిన కళాశాల విద్యార్థులు సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నెల్‌లై జిల్లా చేరమాన్‌దేవి సమీపంలోని కారుకురిచ్చి పుదుకుడి గ్రామానికి చెందిన యువకుడు సీతారామన్‌ (28). గత 3న ఆలంకులం పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా మద్యం మత్తులో బైకుపై వచ్చిన సీతారామన్‌ను పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు.

అతనిపై కేసు నమోదు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న అతని బంధువులు, ప్రైవట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న అతని స్నేహితులు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. వారు వేర్వేరుగా ప్రముఖ సినిమా పాటలకు తగినట్టు సెల్‌ఫోన్‌లో టిక్‌టాక్‌ వీడియో తీసి వాటిని వాట్సాప్‌లలో ఉంచారు.

ఈ వీడియోలు సామాజిక మాద్యమంలో వైరల్‌గా మారియి. విషయం తెలుసుకున్న ఆలంకులం సీఐ అయ్యప్పన్‌ విచారణ ఆ వీడియో తీసిన ఇద్దరు కళాశాల విద్యార్థులపై కేసు నమోదు చేశారు. సీతారామన్‌ సహా ముగ్గురిని గురువారం అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement