పొగరుబోతుకు ఆర్మీ జవాన్‌ జవాబు! | army jawan serious on biker wrong route driving video viral | Sakshi
Sakshi News home page

పొగరుబోతుకు ఆర్మీ జవాన్‌ జవాబు!

Published Mon, Aug 26 2024 10:58 AM | Last Updated on Mon, Aug 26 2024 11:03 AM

army jawan serious on biker wrong route driving video viral

ఆర్మీ అంటేనే క్రమశిక్షణకు, కట్టుబాట్లకు పేరు.. బెటాలియన్‌లోనైనా.. బయటనైనా జవాన్లు పద్ధతి ప్రకారం ఉంటారు. మరి.. తమ చుట్టూ ఉన్నవారు పద్ధతి మీరి కనిపిస్తే... పొగరుగా ప్రవర్తిస్తూంటే...? సహించలేరు కదా? ఈ వీడియోలో ‍కూడా అదే జరిగింది. 

ఇందులో స్కూటర్‌ నడుపుతున్న ఓ వ్యక్తి డివైడర్‌కు ఆవల.. ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంగా నిలబడటమే కాకుండా.. ఆంబులెన్స్‌కూ దారివ్వకుండా... పక్క నుంచి వెళ్లాల్సిందిగా పొగరుగా వ్యవహరించాడు. ఈ విషయం కాస్తా.. వెనుక ఉన్న ఆర్మీ వాహనం డ్రైవర్‌ కంట పడింది. కాసేపు ఊరకున్న.. ఆ వ్యక్తి పొగరుగా చేస్తున్న చేష్టలను ఆ జవాను తట్టుకోలేకపోయాడు. వాహనం నుంచి కిందకు దిగి.. ఆ వ్యక్తి హెల్మెట్‌పైనే ఒక్కటిచ్చుకున్నాడు... ‘‘బుద్ధుందా.. ఎదురుగా ఆంబులెన్స్‌ వచ్చినా దారి ఇవ్వవా’’ అని గడ్డిపెట్టినట్లు ఉన్నాడు. 

అయినా ఆ వ్యక్తి పక్కకు జరగలేదు సరికదా.. ఇంకాస్తా దురుసుగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో ఆ జవాలు.. వాహనంలో ఉంచిన లాఠీని బయటకు తీసి పని చెప్పబోయాడు. ఈ లోపు అక్కడికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసు... ‘‘మీరు ఉండండి సర్‌. ఇక నేను చూసుకుంటాను కదా’’ అని సర్ది చెప్పింది.
ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. @shilpa_cn హ్యాండిల్‌ కలిగిన ‘ఎక్స్‌’ ఖాతాదారు ఒకరు ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్మీ జవాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement