
విడాకులపై వెరైటీగా స్పందించిన అర్భాజ్ ఖాన్
ముంబై: బాలీవుడ్ జంట మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ జంట విడిపోనున్నారనే వార్తలపై నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ వెరైటీగా స్పందించాడు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను రూమర్లంటూ కొట్టి పారేశాడు. అంతేకాదు.. కొంతమంది వాళ్ల పని వాళ్లు చూసుకోకుండా.. పని గట్టుకొని ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తారంటూ మండిపడ్డాడు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదంటూ చురకలంటించాడు. దీనికి సంబంధించి ఆర్భాజ్ తన ఇన్స్టాగ్రామ్లో దబ్స్మాష్ వీడియోను ఒకదాన్ని పోస్ట్ చేశాడు. కుఛ్ తో లోగ్ కహేంగే...లోగోం కా కామ్ హై కహనా.. అనే పాపులర్ హిందీ పాటను దబ్స్మాష్ చేసి మరీ తన కోపాన్ని ప్రదర్శించాడు.
కాగా బాలీవుడ్‌లో అన్యోన్యమైన జంట అర్భాన్, మలైకా విడిపోనున్నారని కొంతకాలంగా పుకార్లు షికార్లు చేశాయి. 1998లో వివాహం చేసుకున్న వీళ్లిద్దరు త్వరలోనే విడాకులు తీసుకోనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాఫిక్. మలైకా ఇప్పటికే తన 14 ఏళ్ల కొడుకుతో వేరే అపార్ట్‌మెంట్లో విడిగా ఉంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్న 'పవర్ కపుల్' లో కూడా కొన్ని రోజులుగా మలైకా కనిపించడం లేదనే కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే..