రామ్‌చరణ్‌, రానాల డబ్‌స్మాష్‌: వైరల్‌ | Rana And Ram Charan Epic Dubsmash Viral In Social Media | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌, రానాల డబ్‌స్మాష్‌: వైరల్‌

Published Fri, May 29 2020 2:48 PM | Last Updated on Fri, May 29 2020 2:58 PM

Rana And Ram Charan Epic Dubsmash Viral In Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దగ్గుబాటి రానాల మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కేవలం సినిమా సహచరులు మాత్రమే కాదు క్లాస్‌మేట్స్‌ కూడా. దగ్గుబాటి, కొణిదెల కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా రానా ప్రేమ విషయంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలను ఫ్యాన్స్‌ తిరిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. (ఆమె యస్‌ చెప్పింది  : రానా)

ఈ క్రమంలో రానా, రామ్‌ చరణ్‌లకు సంబంధించిన డబ్‌స్మాష్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మగధీర చిత్రంలోని ‘ఒక్కొక్కరిని కాదు షేర్‌ ఖాన్‌ ఒకేసారి వందమందిని పంపు’అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌కు వీరిద్దరూ డబ్‌ష్మాష్‌ చేశారు. 2015లో రానా తన ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేస్తూ ‘భైరవతో డబ్‌స్మాష్‌’ అంటూ కామెంట్‌ జత చేశాడు. ఇక దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. విరాటపర్వం, అరణ్య సినిమాలో రానా ఫుల్‌ బిజీగా ఉన్నాడు. (అందుకు ఓ ఎగ్జాంపుల్‌ నా పెళ్లి: రానా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement