
రీసెంట్ టైంలో పెళ్లిళ్లు చాలా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర సెలబ్రిటీల వరకు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో నిర్మాత మహేశ్వర్ రెడ్డి కుమారుడు నితీశ్ రెడ్డి పెళ్లి దుబాయిలో జరిగింది. దీనికి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలేంటంటే?)
దుబాయిలో జరిగిన పెళ్లికి చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాగార్జున కుటుంబాలు వెళ్లాయి. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్ లో రిసెప్షన్ జరగ్గా.. నమ్రత-సితార, రామ్ చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని నమ్రత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొత్త జంట నితీష్-కీర్తిని ఆశీర్వదించింది.


అయితే పార్టీలంటే ముందుండే మహేశ్ బాబు మాత్రం రాజమౌళితో తీస్తున్న సినిమా షూటింగ్ వల్ల వీటిని మిస్ అవుతున్నాడు. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలోని కొండల్లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించి లీకైన ఓ వీడియో క్లిప్ కూడా తెగ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)