
సాధారణంగా ఓ వయసు దాటినా తర్వాత రిస్క్ అనిపించే పనులు చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ కొందరు మాత్రం వయసుతో సంబంధం లేకుండా అడ్వెంచర్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మెగాహీరో రామ్ చరణ్ అత్త, అంటే ఉపాసన తల్లి 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా సాహసాలు చేస్తున్నారు. ఏకంగా 600 కిలోమీటర్ల సైకిల్ రైడ్ చేస్తున్నారు. ఇంతకీ సంగతేంటి? తల్లి గురించి ఉపాసన ఏం కామెంట్ చేసింది?
(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి)
రామ్ చరణ్, ఉపాసనని 2012లో పెళ్లి చేసుకున్నాడు. ఈమె.. అపోలో సంస్థ యజమాని మనవరాలు అని తెలుసు తప్పితే అంతకు మించి ఉపాసన తల్లిదండ్రుల గురించి ఎవరికీ పెద్దగా తెలీదనే చెప్పొచ్చు. ఉపాసన తల్లి పేరు శోభన. ఈమె ప్రస్తుతం అపోలో ఆస్పత్రులకు వైస్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వృతి పరంగా మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ ఈమెకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. గతంలో 2020 డిసెంబరులో తన 60వ పుట్టినరోజు సందర్భంగా 600 కిలోమీటర్ల సైకిల్ రైడ్ చేశారు. అప్పట్లో ఈ విషయమై వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా 'వరల్డ్ సైక్లింగ్ డే' సందర్భంగా తన సైక్లింగ్ అనుభవం గురించి ఉపాసన తల్లి శోభన.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. 2023లో హైదరాబాద్ నుంచి చెన్నై సైకిల్ రైడ్ చేశాననే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. దీనికి కామెంట్ పెట్టిన ఉపాసన.. 'అమ్మ.. నీ ఛాలెంజ్‌ల వల్ల నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది' అని రాసుకొచ్చింది. దీంతో రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)