ఆ ఫొటో పెట్టారని వాట్సప్‌ అడ్మిన్‌ అరెస్టు! | WhatsApp Group Admin Arrested for circulating Morphed Photo of Modi | Sakshi
Sakshi News home page

ఆ ఫొటో పెట్టారని వాట్సప్‌ అడ్మిన్‌ అరెస్టు!

Published Tue, May 2 2017 8:30 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఆ ఫొటో పెట్టారని వాట్సప్‌ అడ్మిన్‌ అరెస్టు! - Sakshi

ఆ ఫొటో పెట్టారని వాట్సప్‌ అడ్మిన్‌ అరెస్టు!

బెంగళూరు: కర్ణాటకలో ఓ వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ అరెస్టయ్యాడు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరుస్తూ వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ పోస్టు పెట్టినందుకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునన్నారు.

కర్ణాటకలో వాట్సాప్‌ గ్రూప్‌ నిర్వాహకుడిని అరెస్టు చేయడం ఇదే ప్రథమం. ఉత్తర కన్నడ జిల్లాలోని మురుదేశ్వర్‌ ప్రాంతానికి చెందిన సన్నథమ్మ నాయక్‌ (30) ’ద బాల్సే బాయ్స్‌’పేరిట ఓ వాట్సప్‌ గ్రూప్‌ను నడుపుతున్నాడు. ఆటో డ్రైవర్‌ అయిన అతను ఇటీవల ప్రధాని మోదీ మీద అసభ్యకరమైన పోస్టు పెట్టడమే కాకుండా.. అశ్లీలంగా, అసభ్యంగా మార్ఫింగ్‌ చేసిన ప్రధాని మోదీ ఫొటోను కూడా సర్క్యులేట్‌ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement