ముజఫర్నగర్: వాట్సాప్ గ్రూప్ లో ఓ వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను అభ్యంతరకరంగా మార్చి పెట్టి బుక్కయ్యాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
తివారీ అనే పోలీసు అధికారి వివరాల ప్రకారం ముజఫర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ప్రధాని మోదీ ఫొటోను అభ్యంతరంగా మార్చి దానిని వాట్సాప్ గ్రూప్ లో పెట్టి అవమానించాడు. ఇది గమనించిన ఓ బీజేపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆ ఫొటోను కూడా పోలీసులకు చూపించాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అభ్యంతరకరంగా మోదీ ఫొటో పెట్టి..
Published Tue, Oct 25 2016 4:12 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
Advertisement
Advertisement