పుష్ప-2 మేకర్స్‌కు షాక్.. అల్లు అర్జున్‌ ఫోటో లీక్! | Allu Arjun Pushpa 2 Movie Shoot Photo Leaked In Internet Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Allu Arjun Pushpa 2 Look Leaked: ఐకాన్ స్టార్‌ 'పుష్ప-2'.. నెట్టింట వైరలవుతోన్న ఫోటో!

Published Wed, Jan 31 2024 3:06 PM | Last Updated on Wed, Jan 31 2024 4:58 PM

Allu Arjun Pushpa 2 Movie Shoot Photo Leaked In Internet Goes viral - Sakshi

ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌ సినీ ప్రేక్షకుల మోస్ట్ అవైటేడ్ చిత్రం 'పుష్ప-2 ది రూల్'. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ కూడా మేకర్స్ ప్రకటించారు. ఇటీవల వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో డైరెక్టర్‌ సుకుమార్‌ మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప రూల్ బిగిన్స్‌ ఇన్ 200 డేస్‌ అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌కు పుష్ప-2 విడుదలపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.  

(ఇది చదవండి: పుష్ప-2 పై రూమర్స్.. డైరెక్టర్‌ సుకుమార్‌ పోస్ట్ వైరల్!)

ఇదిలా ఉంటే తాజాగా పుష్ప-2కు సంబంధించిన అల్లు అర్జున్‌ ఫోటో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్‌ సెట్‌లో అల్లు అర్జున్‌ చీర కట్టుకుని ఉన్న నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్‌ ఈ ఫోటోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే పుష్ప-2 సెట్‌లోని ఫోటో లీక్‌ అయిందా? లేదా ఎవరైనా మార్ఫింగ్‌ చేశారా అంటూ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా షూటింగ్‌ సెట్‌లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సుకుమార్ వెల్లడించారు. మళ్లీ పుష్ప-2 సెట్‌లో ఫోటో లీక్ కావడంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

కాగా.. గతంలో వచ్చిన 'పుష్ప-ది రైజ్' బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించంది. పార్ట్‌-1 సక్సెస్‌ కావడంతో సీక్వెల్‌గా'పుష్ప 2' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మరో నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement