మాటలు అనడం చాలా ఈజీ! | Full script, due to the clarity of dates, the film has been dropped. | Sakshi
Sakshi News home page

మాటలు అనడం చాలా ఈజీ!

Published Thu, Jun 8 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

మాటలు అనడం చాలా ఈజీ!

మాటలు అనడం చాలా ఈజీ!

కమల్‌హాసన్‌ కూతురు, స్టార్‌ హీరోయిన్‌ కాబట్టి శ్రుతీహాసన్‌ బోలెడంత బిల్డప్‌ ఇస్తోందని చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనికి కారణం ‘సంఘమిత్ర’ సినిమా. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో సుందర్‌. సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేయడానికి శ్రుతి అంగీకరించడం, తప్పుకోవడం తెలిసిందే. ‘ఫుల్‌ స్క్రిప్ట్‌ ఇవ్వకపోవడంవల్ల, డేట్స్‌ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నా’ అని శ్రుతీహాసన్‌ క్లారిటీ ఇచ్చినా కొంతమంది వినేట్లు లేరు.

ఎంత స్టార్‌ హీరోయిన్‌ అయితే మాత్రం అంత పెద్ద సినిమాని కాదంటుందా? అని మాట్లాడుకుంటున్నారు. దీనికి శ్రుతి స్పందిస్తూ – ‘‘ఒకరి గురించి మాటలు అనడం చాలా ఈజీ. కానీ, నిజమేంటో తెలుసుకుని అంటే బాగుంటుంది. ఈ సినిమా కోసం రెండేళ్లు కేటాయించాల్సి వస్తుందని నేను తప్పుకున్నానని కొందరి అభిప్రాయం. అది నిజం కాదు. నాక్కావల్సింది స్క్రిప్ట్, డేట్స్‌ విషయంలో క్లారిటీ. అవి తెలుసుకోవడం నా బాధ్యత. దాన్ని కూడా తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. క్లారిటీ లేకుండా ఎవరూ పని చేయలేరు కదా’’ అని శ్రుతీహాసన్‌ అన్నారు. ఈ సినిమా కోసం ఆరు నెలలు కత్తి యుద్ధం నేర్చుకున్నారామె. ‘‘అదేం వేస్ట్‌ కాదు. నేర్చుకున్న కళను వేరే సినిమాకి ఉపయోగిస్తా’’ అని శ్రుతి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement