పెరంబూరు: ఆర్థిక సమస్యల కారణంగా సినీ కాస్ట్యూమర్ సోమవారం ఆత్యహత్య చేసుకున్నాడు. వివరాలు.. స్థానిక కోడంబాక్కమ్, బారతీ కాలనీ రెండో వీధిలో వెంకట్రామన్(45) అనే సినీ కాస్ట్యూమర్ కుటుంబం నివశిస్తోంది. వెంకట్రామన్‌కు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. నెలకు రెండుసార్లే పని దొరికేది. భార్య జాంబవతి(41) నగలను విక్రయించి, దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. వెంకట్రామన్, జాంబవతి దంపతులకు కుమారులు సుబ్రమణి (18), లక్ష్మీవీణై (11) ఉన్నారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న వీరిలో చిన్న కొడుకు 7వ తరగతి పరీక్షలకు పీజు కట్టడానికి డబ్బు అవసరమైంది. చాలా మందిని అప్పు అడిగినా పుట్టకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీంతో సోమవారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్థానిక వడపళని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment