kodambakkam
-
సినీ కాస్ట్యూమర్ ఆత్మహత్య
పెరంబూరు: ఆర్థిక సమస్యల కారణంగా సినీ కాస్ట్యూమర్ సోమవారం ఆత్యహత్య చేసుకున్నాడు. వివరాలు.. స్థానిక కోడంబాక్కమ్, బారతీ కాలనీ రెండో వీధిలో వెంకట్రామన్(45) అనే సినీ కాస్ట్యూమర్ కుటుంబం నివశిస్తోంది. వెంకట్రామన్కు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. నెలకు రెండుసార్లే పని దొరికేది. భార్య జాంబవతి(41) నగలను విక్రయించి, దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. వెంకట్రామన్, జాంబవతి దంపతులకు కుమారులు సుబ్రమణి (18), లక్ష్మీవీణై (11) ఉన్నారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న వీరిలో చిన్న కొడుకు 7వ తరగతి పరీక్షలకు పీజు కట్టడానికి డబ్బు అవసరమైంది. చాలా మందిని అప్పు అడిగినా పుట్టకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీంతో సోమవారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్థానిక వడపళని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
తల్లిదండ్రుల కాళ్లకు మొక్కండి
-
వాళ్ల కాళ్లపై అస్సలు పడొద్దు
సాక్షి, చెన్నై: విలువలు నేర్చుకోవాలని తన అభిమానులకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉద్బోధించారు. అభిమానులతో మూడో రోజు గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించండి. వారి కాళ్లకు మొక్కండి. అంతేకాని ఎవరి కాళ్లపై పడొద్దు. డబ్బు, అధికారం ఉన్నవాళ్ల కాళ్లపై అస్సలు పడొద్ద’ని అన్నారు. బుధవారం పుదుకొట్టై జిల్లాకు చెందిన రజనీగుణ అనే వీరాభిమాని తన రెండు చేతులూ పైకి ఎత్తి జోడించి రజనీకాంత్ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఈ నేపథ్యంలోనే ‘తలైవా’ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈనెల 26 నుంచి అభిమానులతో ఆయన సమావేశమవుతున్నారు. 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం 800 మంది తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగారు. తన రాజకీయ ప్రవేశంపై చివరి రోజున స్పష్టత ఇస్తానని రజనీకాంత్ చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
మాటలు అనడం చాలా ఈజీ!
కమల్‌హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ కాబట్టి శ్రుతీహాసన్ బోలెడంత బిల్డప్ ఇస్తోందని చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనికి కారణం ‘సంఘమిత్ర’ సినిమా. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో సుందర్. సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడానికి శ్రుతి అంగీకరించడం, తప్పుకోవడం తెలిసిందే. ‘ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వకపోవడంవల్ల, డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నా’ అని శ్రుతీహాసన్ క్లారిటీ ఇచ్చినా కొంతమంది వినేట్లు లేరు. ఎంత స్టార్ హీరోయిన్ అయితే మాత్రం అంత పెద్ద సినిమాని కాదంటుందా? అని మాట్లాడుకుంటున్నారు. దీనికి శ్రుతి స్పందిస్తూ – ‘‘ఒకరి గురించి మాటలు అనడం చాలా ఈజీ. కానీ, నిజమేంటో తెలుసుకుని అంటే బాగుంటుంది. ఈ సినిమా కోసం రెండేళ్లు కేటాయించాల్సి వస్తుందని నేను తప్పుకున్నానని కొందరి అభిప్రాయం. అది నిజం కాదు. నాక్కావల్సింది స్క్రిప్ట్, డేట్స్ విషయంలో క్లారిటీ. అవి తెలుసుకోవడం నా బాధ్యత. దాన్ని కూడా తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. క్లారిటీ లేకుండా ఎవరూ పని చేయలేరు కదా’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఈ సినిమా కోసం ఆరు నెలలు కత్తి యుద్ధం నేర్చుకున్నారామె. ‘‘అదేం వేస్ట్ కాదు. నేర్చుకున్న కళను వేరే సినిమాకి ఉపయోగిస్తా’’ అని శ్రుతి అన్నారు. -
నేనిప్పుడు పక్కా తమిళుణ్ని
-
నేనిప్పుడు పక్కా తమిళుణ్ని: రజినీకాంత్
చెన్నై: ‘నేను కర్ణాటక నుంచి వచ్చినా మీ అభిమానంతో నన్ను పూర్తిగా తమిళుయుడిని చేశారు. నాకు గొప్పగా స్వాగతం పలికారు’అని ప్రముఖ దక్షిణాది నటుడు రజినీకాంత్ అన్నారు. ఆయన రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అభిమానులతో చివరి రోజు భేటీ ప్రారంభమైంది. శుక్రవారం చెన్నైలోని కొడాంబక్కంలో తన అభిమానులను కలుసుకున్న సందర్భంగా రజినీకాంత్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన ఏమన్నరంటే.. ‘నేను కర్ణాటకలో 23సంవత్సరాలు జీవించాను. అలాగే తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నాను. నేను కర్ణాటక నుంచి నాకు ఘనస్వాగతం పలికారు.. నన్నొక నిజమైన తమిళుడిగా మార్చారు. నేను ఇప్పుడు పక్కా తమిళుయుడిని. రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది. దానిని ప్రక్షాళన చేయాల్సి ఉంది’ అని ఆయన చెప్పారు. తనను తమిళనాడు నుంచి వెళ్లిపొమ్మంటున్నారని, అలా వెళ్లిపోయే ప్రసక్తి లేదని రజినీకాంత్ చెప్పారు. తాను పక్కా తమిళుడినే అన్న ఆయన తాను ఏం మాట్లాడినా మీడియా తనను తరుముతోందని, సంచలనం చేస్తోందని, ఇందుకు రాజకీయాలే కారణం అని అన్నారు. తాను ఎంతో క్రమ శిక్షణతో ఉండటం వల్లే ఇలా ఉన్నానని చెప్పిన రజినీ ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చినప్పుడు తన గొంతు వినిపిస్తానని చెప్పారు. ‘ మీతోపాటే నాక్కూడా బాధ్యతలు, పనులు ఉన్నాయి. ఇప్పుడవి చేద్దాం. కానీ, తప్పనిసరి పోరాటం వచ్చినప్పుడు మనందరం చూస్తాం’ అని ఆయన అన్నారు. సరైన సమయంం వచ్చినప్పుడు అభిమానం చూపించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘రాజకీయాల్లో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ, వ్యవస్థ చెత్తగా మారినప్పుడు మనమేం చేస్తున్నాం. ప్రజాస్వామ్యం భ్రష్టుపడిపోయింది. వ్యవస్ధ మారాలి. ప్రజల ఆలోచనల్లోంచి మార్పు రావాలి. అప్పుడే దేశం సరైన మార్గంలో ముందు కెళుతోంది’ అని రజినీ చెప్పారు. -
అప్పుడు ఆ మేడ మెట్లే నాకు నీడ అయ్యాయి!
బిహైండ్ ది రీల్ ఏచూరి చలపతిరావు చెన్నైలోని కోడంబాకం... ఫుల్ బిజీ ఏరియా. కార్లు.. బస్సులు... ఆటోలు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ఓ 74ఏళ్ల ముసలాయన.. సారీ.. యువకుడు సైకిల్ మీద సవారీ చేస్తూ కనిపిస్తే కచ్చితంగా ఆయన ఏచూరి చలపతిరావే. ఏచూరి గురించి ఏం చెప్పాలి? స్టార్ జర్నలిస్ట్ అనాలా! సీనియర్ ఆర్టిస్టు అని చెప్పాలా! 62ఏళ్ల హిస్టరీ ఆయనది.. తెలుగు సినిమా చరిత్ర టకీటకీమని చెప్పేయగలరు. దాదాపు వెయ్యి సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ, ఏం లాభం? నో బ్యాంక్ బ్యాలెన్స్... నో ఫ్లాట్. పాతకాలం సైకిలే ఆయనకు మిగిలిన ఆస్తి. ఉంటున్నది రెండు గదుల అద్దె ఇల్లు. అద్దె నాలుగువేలు, కరెంటు బిల్లు వెయ్యిరూపాయలు. 97ఏళ్ల తల్లి... 73ఏళ్ల భార్యతో ఆ ఇంట్లోనే ఏచూరి రోజులు నెట్టుకొస్తున్నారు... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ‘అమ్మ క్యాంటీన్’ ఆయన పాలిట అక్షయపాత్ర. రూపాయికి ప్లేటు ఇడ్లీ... ఐదు రూపాయలకు పొంగల్. పెరుగన్నం... సాంబారన్నం ఖరీదు కూడా ఐదు రూపాయలే. ఇంట్లో ఆడవాళ్లకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆహారానికి అమ్మ క్యాంటీనే ఆసరా. మరి... నెలసరి ఖర్చులకు ఏచూరి ఏం చేస్తారు?.. ఎవరి దగ్గరా చెయ్యి చాచరు.. ఎవరికీ తలవొంచరు. ‘‘ఆ పరిస్థితే వస్తే చావడానికైనా రెడీ. ఆత్మాభిమానాన్ని వదులుకోను’’ అన్నారు ఏచూరి. ఆరోగ్యం బాగాలేకపోతే తేజ ఆసుపత్రి అధినేతలు డా. నండూరి విజయసారధి, డా. సరోజిని వైద్యం చేస్తారని ఏచూరి చెప్పారు. పాత్రికేయుల్లో ఇంటూరి వెంకటేశ్వరరావు తన గురువని, కంపెల్ల రవిచందర్ మిత్రుడని, బీఏ రాజు, జయ చేసిన సహాయం మర్చిపోలేనిదని ఏచూరి చెప్పారు. నాటి తరం నటుల్లో ఏచూరికి తెలియనివాళ్లు లేరు. ఎన్టీఆర్, ఎస్వీఆర్‌ల అభిమానం పొందిన వ్యక్తి. శోభన్‌బాబుతో ఒకే కంచం, ఒకే మంచం తరహా స్నేహం... కృష్ణ, కృష్ణంరాజు... ఇలా ఎంతోమంది ఏచూరిని ఇష్టపడతారు. దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, కె. బాపయ్య, శారద, గీతాంజలి, ఎమ్మెస్ రాజు వంటివారు పంపించే డబ్బే జీవనాధారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సాయిబాబా ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. అసలు ఏచూరి జీవిత విశేషాలేంటి? విలేకరి నుంచి నటుడిగా ఎందుకు మారారు? ఆ విషయాలు తెలుసుకుందాం... 1940 నవంబర్ 13న కోనసీమలోని మాగాం గ్రామంలో పుట్టారు ఏచూరి. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నారు. రాజబాబు, మాడా ఈయన క్లాస్‌మెట్స్. ఏచూరికి సినిమాలంటే పిచ్చి ప్రేమ. వచ్చిన ప్రతి సినిమా చూసి, వాటి గురించి కథనాలు రాయడం... విమర్శనాత్మక కథనాలు బోల్డన్ని. అన్నిటికీ అభినందనలే. ఇక, సొంత ఊళ్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులపాలు కాక తప్పదని, పన్నెండేళ్ల వయసులోనే మద్రాసు వెళ్లారు. అప్పటికే ఏచూరి రాసిన కథనాలకు మంచి గుర్తింపు రావడంతో విలేకరిగా అవకాశం వచ్చింది. అయితే మద్రాసులో ఎక్కడ ఉండాలి?... ‘‘అప్పటిమోడర్న్ థియేటర్ మెట్లే కొండంత నీడ అయ్యాయి’’ అన్నారు ఏచూరి. చాలీచాలని జీతం.. కడుపునిండా భోంచేసిన రోజులు చాలా తక్కువ. కానీ, ప్రశంసలకు కొరత లేదు. ‘భేష్.. ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా రాస్తున్నావు’ అని అభినందించినవారూ ఉన్నారు. ఆగ్రహించినవాళ్లూ లేకపోలేదు. ఒకసారి ఏదో కథనం రాస్తే... ఎన్టీఆర్, ఏయన్నార్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తే, శోభన్‌బాబు, కృష్ణ అభిమానులు ఏచూరిని వెనకేసుకొచ్చారు. కళాకారులకు అభిమానులుంటారు కానీ, ఓ విలేకరి అభిమానులను సంపాదించుకోవడం గ్రేటే... ఓ రోజు.. ‘ఏరా ఇలా విలేకరిగా కొనసాగితే ఇక ఎప్పటికీ సంపాదించలేవు.. ఆర్టిస్ట్‌గా ట్రై చేయి’ అని ఎస్వీఆర్ సలహా ఇచ్చారు. అది ఏచూరికి నచ్చింది. అంతే.. ఒకవైపు రచన, మరోవైపు నటనతో ఫుల్ బిజీ అయ్యారు. తెలుగులో తొలి సినిమా ‘కనకదుర్గ పూజా మహిమ’. కమలాకర కామేశ్వరరావు, విఠలాచర్య, దాసరి నారాయణరావు, ముత్యాల సుబ్బయ్య, పోకూరి బాబూరావు తదితరులు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. కన్నడంలో ‘మహా కబీరు’ అనే చిత్రంలో యాచకుడిగా చేశారు. ఆ పాత్రలో నిజమైన యాచకుడేమో అనుకునేలా ఒదిగిపోయారు ‘‘అది సినిమా కోసం వేసిన వేషం. నిజజీవితంలో దుర్భరమైన పరిస్థితులు చవి చూసినా, ఎవరి దగ్గరా చెయ్యి చాపలేదు’’ అన్నారు ఏచూరి. ఆ మధ్య విడుదలైన ‘సుడిగాడు’ వరకూ ఆయన చేసిన సినిమాలు దాదాపు వెయ్యి. ‘‘అన్ని సినిమాలు చేసినా సహాయ నటుణ్ణి కాబట్టి పారితోషికం తక్కువ. అందుకే, ఏమీ సంపాదించుకోలేకపోయా’’ అన్నారు ఏచూరి. ఓసారి కృష్ణ అయితే.. ‘‘నాతో పాటు ఉందువుగానీ.. నా వ్యవహారాలన్నీ చూసుకుందువుగానీ వచ్చెయ్’’ అన్నారట. ‘‘అదే చేసి ఉంటే ఈపాటికి ఓ మేడ, పడవలాంటి కారు ఉండేవేమో.. అంతా జాతకం’’ అన్నారు ఏచూరి. అన్నట్లు.. ఏచూరి జాతకం కూడా చెబుతారు. 20ఏళ్ల క్రితమే ఆంధ్ర రాష్ట్రం విడిపోతుందని, వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేస్తే మంచిదని చెప్పారు. నక్షత్రం చెబితే చాలు.. మన జీవితం చెప్పేస్తారు. అందరి జాతకం చెప్పే ఏచూరి.. ఇటీవల తన జాతకాన్ని తిరగేశారు. షాక్‌లాంటి నిజం తెలిసింది. ‘‘వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లల్లో మా ఇంట్లో ఏదో అశుభం జరగనుంది. అది మరణానికి సంబంధించినది’’ అని చెప్పారు ఏచూరి. బహుశా ఆయన తల్లికి 97ఏళ్లు కాబట్టి.. ఆవిడకే ఏదైనా... అని ఊహించుకోవచ్చు. కానీ.. అది కాదు.. ‘‘నా జీవితం మరో ఏడాదిన్నర, రెండేళ్లలోపు ముగుస్తుంది’’ అని సింపుల్‌గా చెప్పారు. ఇప్పటివరకు ఏచూరి చెప్పిన జాతకాలన్నీ దాదాపు నిజమయ్యాయట. ఈసారి నిజం కాకపోతే ఎంత బావుంటుందో కదా! - డి.జి. భవాని