
సాక్షి, చెన్నై: విలువలు నేర్చుకోవాలని తన అభిమానులకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉద్బోధించారు. అభిమానులతో మూడో రోజు గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించండి. వారి కాళ్లకు మొక్కండి. అంతేకాని ఎవరి కాళ్లపై పడొద్దు. డబ్బు, అధికారం ఉన్నవాళ్ల కాళ్లపై అస్సలు పడొద్ద’ని అన్నారు. బుధవారం పుదుకొట్టై జిల్లాకు చెందిన రజనీగుణ అనే వీరాభిమాని తన రెండు చేతులూ పైకి ఎత్తి జోడించి రజనీకాంత్ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఈ నేపథ్యంలోనే ‘తలైవా’ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.
చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈనెల 26 నుంచి అభిమానులతో ఆయన సమావేశమవుతున్నారు. 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం 800 మంది తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగారు. తన రాజకీయ ప్రవేశంపై చివరి రోజున స్పష్టత ఇస్తానని రజనీకాంత్ చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment