సాక్షి, చెన్నై: తన రాజకీయం ప్రవేశం కాలమే నిర్ణయిస్తుందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. సినిమా నటులు రాజకీయాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో నాలుగు రోజు శుక్రవారం కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, వేలూరు జిల్లాలకు చెందిన అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఉద్బోధించారు.
‘రాజకీయాల్లో రావాలంటే కాలం, సమయం ముఖ్యం. మొన్న శివాజీ గణేశన్, నిన్న నేను, ఈరోజు మరొకరు. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది. ఇంకా రెండు రోజులే ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్నాను. కానీ కాలంతో పాటు ప్రయాణించాల్సిందే. దేన్నైనా కాలమే నిర్ణయిస్తుందని రజనీకాంత్ అన్నారు. ఒకప్పుడు ఎంజీఆర్ నటుడైనా కూడా రాజకీయాల్లో నిబద్దతతో రాణించారు. ఇప్పుడు పాత తరం మారింది. ఇప్పుడు అంతా కొత్త తరానిదే. మళ్లీ మళ్లీ నేను చెప్పేది ఒకటే. ఇవన్నీ పక్కన పెడితే ముందు మీ తల్లితండ్రులు, కుటుంబం, జీవనంపై దృష్టిసారించండ’ని అభిమానులకు హితబోధ చేశారు.
కాగా, 'రజనీ పేరవై' (రజనీ సమాఖ్య) పేరుతో సంస్థను ఏర్పాటుచేసి ఆయన రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ఈనెల 31వ తేదీన పేరవైని ప్రకటిస్తారని అభిమానులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment