అభిమానులు లేనిదే ఏ హీరో లేడులే అన్నది వాస్తవం. అందుకే ప్రముఖ నటులు అభిమానులే మా దేవుళ్లు అంటుంటారు. ఈ అభిమానం అన్నది ఎంత వ్యసనం అంటే తమ అభిమాన హీరోల చిత్రాలు విడుదలయితే చూడాలని తహ తహలాడుతుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా అభిమానులు సినిమాలు చూడటంతో సరిపెట్టుకోరు. కొందరు తమ అభిమాన నటీనటులకు గుడులు కట్టించి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఇది అభిమానానికి పరాకాష్ట అని చెప్పవచ్చు.
ఇక నటుడు రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన్ను చూడటానికి అనేకమంది అభిమానులు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి సమయంలో రజనీకాంత్ ఇంటి గేటు వరకు వచ్చి చెయ్యి పైకెత్తి అభివాదం చేస్తే చాలు.. వాళ్ల జన్మ ధన్యమైనట్లు ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు. కాగా అలాంటి వీరాభిమాని ఒకరు నటుడు రజనీకాంత్‌కు గుడి కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు.. అతని పేరు కార్తీక్. ఇతను ఓ మాజీ సైనికుడు కావడం విశేషం.
మధురై జిల్లా, తిరుమంగంలో అతను రజనీకాంత్‌కు గుడి కట్టించి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్ తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్ గార్డెన్లోని తన ఇంటికి రప్పించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి తన ఇంటిని చూపించి వారితో ఫొటోలు దిగి, బాబా విగ్రహాన్ని కానుకగా అందించి సంతోష పెట్టారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Tamil Nadu: Fans of actor Rajinikanth offered prayers at Rajinikanth temple in Madurai on the occasion of his birth anniversary. pic.twitter.com/Ski0udt9sf
— ANI (@ANI) December 12, 2023
Comments
Please login to add a commentAdd a comment