Tamil Superstar
-
కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది
-
రెండు రోజులే ఉంది: రజనీకాంత్
సాక్షి, చెన్నై: తన రాజకీయం ప్రవేశం కాలమే నిర్ణయిస్తుందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. సినిమా నటులు రాజకీయాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో నాలుగు రోజు శుక్రవారం కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, వేలూరు జిల్లాలకు చెందిన అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఉద్బోధించారు. ‘రాజకీయాల్లో రావాలంటే కాలం, సమయం ముఖ్యం. మొన్న శివాజీ గణేశన్, నిన్న నేను, ఈరోజు మరొకరు. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది. ఇంకా రెండు రోజులే ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్నాను. కానీ కాలంతో పాటు ప్రయాణించాల్సిందే. దేన్నైనా కాలమే నిర్ణయిస్తుందని రజనీకాంత్ అన్నారు. ఒకప్పుడు ఎంజీఆర్ నటుడైనా కూడా రాజకీయాల్లో నిబద్దతతో రాణించారు. ఇప్పుడు పాత తరం మారింది. ఇప్పుడు అంతా కొత్త తరానిదే. మళ్లీ మళ్లీ నేను చెప్పేది ఒకటే. ఇవన్నీ పక్కన పెడితే ముందు మీ తల్లితండ్రులు, కుటుంబం, జీవనంపై దృష్టిసారించండ’ని అభిమానులకు హితబోధ చేశారు. కాగా, 'రజనీ పేరవై' (రజనీ సమాఖ్య) పేరుతో సంస్థను ఏర్పాటుచేసి ఆయన రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ఈనెల 31వ తేదీన పేరవైని ప్రకటిస్తారని అభిమానులు భావిస్తున్నారు. -
తల్లిదండ్రుల కాళ్లకు మొక్కండి
-
వాళ్ల కాళ్లపై అస్సలు పడొద్దు
సాక్షి, చెన్నై: విలువలు నేర్చుకోవాలని తన అభిమానులకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉద్బోధించారు. అభిమానులతో మూడో రోజు గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించండి. వారి కాళ్లకు మొక్కండి. అంతేకాని ఎవరి కాళ్లపై పడొద్దు. డబ్బు, అధికారం ఉన్నవాళ్ల కాళ్లపై అస్సలు పడొద్ద’ని అన్నారు. బుధవారం పుదుకొట్టై జిల్లాకు చెందిన రజనీగుణ అనే వీరాభిమాని తన రెండు చేతులూ పైకి ఎత్తి జోడించి రజనీకాంత్ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఈ నేపథ్యంలోనే ‘తలైవా’ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈనెల 26 నుంచి అభిమానులతో ఆయన సమావేశమవుతున్నారు. 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం 800 మంది తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగారు. తన రాజకీయ ప్రవేశంపై చివరి రోజున స్పష్టత ఇస్తానని రజనీకాంత్ చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
మిత్రబంధం!
చెన్నై: టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరునావుక్కరసు, రజనీకాంత్‌ల మధ్య మంచి స్నేహబంధం ఉందట. ఇది మిత్రబంధమేనని ఎలాంటి రాజకీయాలకు తావు లేదని తిరునావుక్కరసర్ స్పష్టం చేశారు. -
అయిదేళ్లుగా పన్ను ఎగ్గొడుతున్న హీరో?
చెన్నై: తమిళ సూపర్ స్టార్ , కత్తి హీరో విజయ్ గత అయిదేళ్లుగా ఆదాయ పన్ను చెల్లించడం లేదని సమాచారం. ఆదాయ పన్ను అధికారులు అందించిన సమాచారం ప్రకారం గత అయిదేళ్లుగా ఆయన పన్ను ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల తమిళ, తెలుగు, కన్నడ చిత్ర రంగ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులపై ఐటి దాడులు జరిగిన నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఈ వార్తలను విజయ్ ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవాలని ఆయన కొట్టి పడేశారు. తాము చాలా శ్రద్ధగా టాక్స్‌లను చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా అన్ని రకాల పన్నులను విధిగా చెల్లించానని విజయ్ స్పష్టం చేశారు. గతవారం ఐటి అధికారులు తమ ఇంటిపై దాడులు చేసినపుడు ఈ వివరాలను వారికి అందించామన్నారు. తాను, తన కుటుంబ సభ్యులు తమ ఐటి రిటర్న్స్‌కు సంబంధించిన , సాక్ష్యాలను, పూర్తి పత్రాలను సమర్పించామని పేర్కొన్నారు. కాగా ఇటీవల హీరో విజయ్, హీరోయిన్లు నయనతార, సమంతా, పులి డైరెక్టర్లు సహా కొంతమంది నటీనటుల ఇళ్లపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరికి సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల బన్ను బకాయిలు ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అంతర్జాతీయ సినీ వేడుకలకు రజనీకి ఆహ్వానం
గోవాలో నవంబర్‌లో జరిగే భారత అంతర్జాతీయ సినిమా వేడుకలను (ఇప్ఫీ) తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రారంభించే అవకాశముంది. ఈ కార్యక్రమానికి రజనీని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జరిగే చలనచిత్ర వేడుకలకు రజనీ వస్తే స్టార్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారని గోవా ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షుడు విష్ణు వాగ్ చెప్పారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న ఆరంభంకానుంది. గతేడాది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.