
తిరువళ్లూరు: సెల్‌ఫోన్ ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన ఎనిమిదవ తరగతి విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో శుక్రవారం వి«షాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి ఎన్‌జీఓ కాలనీకి చెందిన బాబు కుమారుడు రాకేష్(14). ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాకేష్ పెద్దమ్మ ఇంటికి వెళ్లి ఆన్‌లైన్ క్లాస్ వుందని చెప్పి మొదటి అంతస్తులోకి వెళ్లాడు.
చాలా సేపటికీ రాకపోవడంతో బంధువులు పైకెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో రాకేష్ తరచూ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడేవాడని తెలిసింది. ఆన్‌లైన్ గేమ్ బాలుడి మృతికి కారణమై వుండొచ్చన్న పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment