తమిళసినిమా: కింద పడిపోయినా తాము పైనే ఉన్నాం అంటారు కొందరు హీరోయిన్లు. చేతిలో అవకాశాలు లేకపోయినా, ఆ భాషలో, ఈ భాషలో నటిస్తున్నాను అంటూ మార్కెట్ లేని విషయాన్ని అస్సలు అంగీకరించరు. ప్రస్తుతం నటి శ్రుతిహాసన్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇంతకు ముందు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక్‌దమ్ నటిస్తూ యమ బిజీగా ఉన్న నటి శ్రుతిహాసన్. అలాంటిది ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం లేదు. ఏదైనా ఉందంటే అది తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్‌నాయుడునే. అదీ మధ్యలోనే ఆగిపోయింది.
శ్రుతీకి తన తండ్రితో కలిసి నటించడం కలిసి రాలేదా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో తలెత్తుతోంది. ఎందుకంటే అప్పటి వరకూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ తరువాత అంగీకరించిన భారీ చిత్రం సంఘమిత్ర అవకాశాన్ని కాలదన్నుకున్నారు. ఆ అంశం పెద్ద వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అంతే కాదు ఆ తరువాత ఒక్కటంటే ఒక్క అవకాశం శ్రుతిహాసన్‌ను పలకరించలేదు. అయితే ఈ విషయాన్ని ఆ ముద్దుగుమ్మ ఒప్పుకోవడం లేదు. తనకు అవకాశాలు రావడం లేదన్నది నిజం కాదని, చాలా అవకాశాలు వస్తున్నా, తానే నిరాకరిస్తున్నానని చెప్పుకొచ్చారు.
కారణం ఏమిటన్న ప్రశ్నకు తానిప్పుడు రీచార్జ్ అవుతున్నానని మళ్లీ తన విజృంభణను చూస్తారని అంటున్నారు. ఏదేమైనా శ్రుతిహాసన్ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవచ్చు. అదే విధంగా హీరోల మార్కెట్‌నైనా అంచనా వేయవచ్చు గానీ, హీరోయిన్ల మార్కెట్ గురించి వెంటనే ఒక నిర్ణయానికి రాలేం. ఇవాళ అవకాశాలు లేకపోయినా రేపు బిజీ అయిపోవచ్చు. కాజల్‌అగర్వాల్, తమన్నా లాంటి హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను దాటి వచ్చిన వారే.
Comments
Please login to add a commentAdd a comment