No chance
-
‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితి రాకుండా ప్రజలకు ఒక అవకాశం కల్పించేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దులా వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు కాదేమోనన్న అనుమానాలు అక్కర్లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దాల్ సరస్సులో ఆదివారం షికారా(పడవ)లతో చేపట్టిన ర్యాలీలో అబ్దుల్లా మాట్లాడారు. ఎన్నికల తర్వాత జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడాలని బీజేపీ కోరుకుంటోందని, తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను పొడిగించాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, ప్రజలు బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోరని చెప్పారు. కశ్మీర్ లోయలో ప్రచారంతో ఫలితం ఉండదని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు జమ్మూలో మాత్రమే పర్యటిస్తున్నారని ఒమర్ వ్యాఖ్యానించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాల పాలన అంటూ విమర్శలు చేస్తోందన్నారు. -
Recession In India 2022: భారత్‌లో మాంద్యానికి ఆస్కారమే లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకోనుందన్న భయాలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో అటువంటి పరిస్థితేమీ రాబోదని నీతి ఆయోగ్ మాజీ వైస్–చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడినా .. దేశీయంగా మాంద్యం తలెత్తబోదని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో వృద్ధి రేటు 6–7 శాతం స్థాయిలో ఉంటుందని కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా, యూరప్, జపాన్‌తో పాటు చైనా తదితర దేశాల్లో ఏకకాలంలో మందగమనం కనిపిస్తోందని, దీనితో రాబోయే నెలల్లో ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకునే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో కుమార్ చెప్పారు. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం మరికొంత కాలం పాటు 6–7 శాతం స్థాయిలోనే ఉండవచ్చని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని, అలా కాకపోతే దేశీయ సానుకూల అంశాల కారణంగా ద్రవ్యోల్బణం దిగి రాగలదని కుమార్ చెప్పారు. ఎగుమతులపై దృష్టి పెట్టాలి.. వాణిజ్య లోటు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులను పెంచుకోవడానికి తగిన విధానాలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కుమార్ చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉన్నప్పుడు దేశం మొత్తానికి ఒకే ఎగుమతుల విధానం అమలుపర్చడం సరికాదన్నారు. సముద్ర తీరమే లేని పంజాబ్‌కు, శతాబ్దాలుగా సముద్ర వాణిజ్యం చేస్తున్న తీర ప్రాంత రాష్ట్రం తమిళనాడుకు ఒకే తరహా ఎగుమతుల విధానాలు పని చేయవని కుమార్ చెప్పారు. -
కరోనా మృతదేహాల నిర్వహణ ఇలా..!
న్యూఢిల్లీ: కోవిడ్–19తో మరణించిన వారి మృతదేహాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అంతగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, మృతదేహం వద్ద పనిచేసే వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. వాటిలో ముందు జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ నివారణ, వాతావరణం వైరస్‌తో కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మొదలైనవి ఉన్నాయి. ‘దగ్గు, తుమ్ము సమయంలో వెలువడే డ్రాప్లెట్స్ కారణంగానే కరోనా వైరస్ ప్రధానంగా వ్యాపిస్తుంది. మృతదేహం ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయితే, వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పోస్ట్‌మార్టం సమయంలో మృతదేహంలోని ఊపిరితిత్తుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’ అని అందులో వివరించారు. శ్మశానాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్‌లు, గ్లవ్స్‌ను వినియోగించడం వంటి నిర్ధారిత జాగ్రత్తలు తీసుకోవాలని శ్మశానంలోని సిబ్బందికి వివరించాలన్నారు. మృతదేహాన్ని ముట్టుకోకుండా చివరి చూపు చూడొచ్చని, ఇతర మతపరమైన ప్రక్రియలు కూడా నిర్వహించవచ్చని వివరించారు. మృతదేహానికి స్నానం చేయించడం, హత్తుకోవడం, ముట్టుకోవడం మాత్రం చేయవద్దని హెచ్చరించారు. అంత్యక్రియల అనంతరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా శుభ్రంగా స్నానం చేయాలని సూచించారు. అయితే, అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరుకావడం మంచిది కాదని పేర్కొన్నారు. మత సంప్రదాయాల ప్రకారం నదీజలాల్లో కలిపేందుకు మృతదేహానికి సంబంధించిన బూడిదను సేకరించవచ్చని, దాని వల్ల వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. -
పాత కాపులే!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ఎల్పీలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటన పూర్తి భరోసా ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు కొంతకాలంగా అభద్రతా, అపోహల మధ్య ఉన్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు కూడా లేనిపోని ప్రచారాలకు తెరలేపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు విడతలుగా చేయించిన సర్వే చాలామందిలో అయోమయం, ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో థర్డ్‌ఫ్రంట్ తెరమీదకు రావడం.. వచ్చే ఎన్నికల్లో మంత్రులను ఎంపీలుగా, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతారన్న ప్రచారం అధికార పార్టీలో గందరగోళానికి వేదికైంది. ఈ ప్రచారం చాలామంది ప్రజాప్రతినిధులను టెన్షన్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో 2019 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకే ‘సిట్టింగ్’ స్థానాలను కేటాయిస్తామని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొంతకాలంగా అభద్రతాభావంతో ఉన్న ప్రజాప్రతినిధులకు ఆయన ప్రకటన భరోసా ఇచ్చినట్లయ్యింది. సీఎం స్వయంగా చేయించిన మూడు విడతల సర్వేలో ‘గ్రాఫ్’ తగ్గిన ప్రజాప్రతినిధులూ తేరుకుంటున్నారు. ప్రచారాలు, అపోహలకు తెర.. సీఎం ప్రకటనతో ఊరట సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ జరుగుతున్న రకరకాల ప్రచారాలు అధికార పార్టీలో గందరగోళం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ పలువురికి ఉద్వాసన పలుకుతారన్న చర్చ కూడా ఉమ్మడి జిల్లాలో ‘వైరల్’ అయ్యింది. ఈ ప్రచారాలపై అధికార పార్టీ నేతలు కొందరు వివరణ ఇచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పార్లమెంట్‌కు వెళ్తారని, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ జిల్లాలోని ఓ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి శాసనసభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్ బరిలో ఉంటారని, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఈసారి రాజన్న సిరిసిల్లలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదుచోట్ల అభ్యర్థుల మార్పు అనివార్యమన్న ప్రచారమూ అధికారపార్టీలో నిన్నామొన్నటి వరకు ‘వైరల్’ కావడం పలువురిని ఆందోళనకు గురి చేసింది. ఇదే సమయంలో అధినేత కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌ను తెరమీదకు తీసుకురావడం, ఉద్యమంలో తనవెంట అడుగులేసిన సీనియర్లను ఎంపీలుగా తీసుకెళ్తానని ప్రకటించడంతో జిల్లాకు చెందిన పలువురు ఇప్పుడున్న అవకాశాలు కోల్పోతారన్న చర్చ గందరగోళం సృష్టించింది. ఇదే సమయంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ఎల్పీలో కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. 2019 వరకు తానిక్కడే ఉంటానని, ఆ ఎన్నికల్లో అందరూ సిట్టింగ్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు ఇస్తానని చేసిన ప్రకటన అపోహలకు తెరవేసి కొండంత భరోసా ఇచ్చింది. వలస, కొత్తగా అశావహులకు నోఛాన్స్ మూడు విడతలుగా సర్వేల ఫలితాలను ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరును వారి కళ్లకు కట్టారు. రెండు సర్వేలను సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మూడో విడత సర్వే నివేదికను డిసెంబర్లో కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12 కాగా.. శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల పనితీరు, టీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీల బలాబలాలను కేసీఆర్ వివరించారు. ఆ సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు 89.90 శాతంతో ఫస్ట్ ర్యాంకు రాగా.. మంత్రి కేటీఆర్ 79.60 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. తొలి, రెండో సర్వేలకు పోలిస్తే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల్లో చాలామందికి ‘గ్రాఫ్’ తగ్గగా.. కొందరు ఫరవాలేదనిపించారు. ఇంకొందరు పాసు మార్కులకే పరిమితం అయ్యారు. మరికొందరు పాస్‌మార్కులను కొంచెం పైకి పెరిగారు. ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ప్రజలు వేసిన మార్కులను కేసీఆర్ ప్రజాప్రతినిధులకు వివరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చాలామందికి టిక్కెట్లు ఇవ్వడం కష్టమేనన్న చర్చ జరిగింది. ఆది వారం టీఆర్ఎస్ఎల్పీ సందర్భంగా సీఎం ‘సిట్టింగు’లందరికీ టిక్కెట్లు ఇస్తామనడం ‘గ్రాఫ్’ తగ్గిన నేతలకు ఊరటనిచ్చింది. కేసీఆర్ ప్రకటన సిట్టింగ్‌లకు భరోసా ఇవ్వగా, వలస నేతలు, కొత్తగా టిక్కెట్లు ఆశించే వారికి ఈసారి ఆశాభంగమే కలగనుందన్న చర్చ సాగుతోంది. -
రీచార్జ్ అవుతున్నా!
తమిళసినిమా: కింద పడిపోయినా తాము పైనే ఉన్నాం అంటారు కొందరు హీరోయిన్లు. చేతిలో అవకాశాలు లేకపోయినా, ఆ భాషలో, ఈ భాషలో నటిస్తున్నాను అంటూ మార్కెట్ లేని విషయాన్ని అస్సలు అంగీకరించరు. ప్రస్తుతం నటి శ్రుతిహాసన్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇంతకు ముందు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక్దమ్ నటిస్తూ యమ బిజీగా ఉన్న నటి శ్రుతిహాసన్. అలాంటిది ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం లేదు. ఏదైనా ఉందంటే అది తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్నాయుడునే. అదీ మధ్యలోనే ఆగిపోయింది. శ్రుతీకి తన తండ్రితో కలిసి నటించడం కలిసి రాలేదా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో తలెత్తుతోంది. ఎందుకంటే అప్పటి వరకూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ తరువాత అంగీకరించిన భారీ చిత్రం సంఘమిత్ర అవకాశాన్ని కాలదన్నుకున్నారు. ఆ అంశం పెద్ద వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అంతే కాదు ఆ తరువాత ఒక్కటంటే ఒక్క అవకాశం శ్రుతిహాసన్‌ను పలకరించలేదు. అయితే ఈ విషయాన్ని ఆ ముద్దుగుమ్మ ఒప్పుకోవడం లేదు. తనకు అవకాశాలు రావడం లేదన్నది నిజం కాదని, చాలా అవకాశాలు వస్తున్నా, తానే నిరాకరిస్తున్నానని చెప్పుకొచ్చారు. కారణం ఏమిటన్న ప్రశ్నకు తానిప్పుడు రీచార్జ్ అవుతున్నానని మళ్లీ తన విజృంభణను చూస్తారని అంటున్నారు. ఏదేమైనా శ్రుతిహాసన్ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవచ్చు. అదే విధంగా హీరోల మార్కెట్నైనా అంచనా వేయవచ్చు గానీ, హీరోయిన్ల మార్కెట్ గురించి వెంటనే ఒక నిర్ణయానికి రాలేం. ఇవాళ అవకాశాలు లేకపోయినా రేపు బిజీ అయిపోవచ్చు. కాజల్‌అగర్వాల్, తమన్నా లాంటి హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను దాటి వచ్చిన వారే. -
ఎన్టీఆర్ విద్యోన్నతి..అభ్యర్థులు అధోగతి
రెండోవిడత ఎంపికపై నీలినీడలు! వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి మొండిచేయి అనంతపురం ఎడ్యుకేషన్ : ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంపై ఆశలు పెట్టుకుని సివిల్స్ రాయాలనుకున్న చాలామంది అభ్యర్థులు కొందరు అధికారుల అలసత్వం కారణంగా అధోగతి పాలవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్, బ్రెయిన్ ట్రీ, లక్ష్మయ్య కోచింగ్ సెంటర్‌తో పాటు బెంగళూరులోని యూనివర్సల్, ఢిల్లీలోని శ్రీరామ్స్ కోచింగ్ సెంటర్లలో ఉచితంగా తొమ్మిది నెలలపాటు శిక్షణ ఇప్పిస్తారు. నెలకు రూ.8 వేలు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం–2016 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది ఎస్సీ, 300 మంది ఎస్టీ అభ్యర్థులకు శిక్షణ ఇప్పించాల్సి ఉండగా, వీరిని ఎంపిక చేయడానికి కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ వారు ఆగష్టు 28న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించారు. 2వేల మందితో మెరిట్ లిస్టు తయారు చేశారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 1000 మంది అభ్యర్థులను పిలిచారు. - హాజరైన వారిలో 137 (ఎస్సీలు 107, ఎస్టీలు 30) మంది ఇదివరకే శిక్షణ తీసుకున్నవారు కావడంతో అధికారులు వీరికి అవకాశం కల్పించలేదు. అయితే నోటిఫికేషన్లో ‘శిక్షణ తీసుకున్న వారు అనర్హులు’ అనే విషయాన్ని పొందుపరచక పోవడం వల్లే తాము పరీక్ష రాశామని, ఎంపికయ్యాక కాదంటే ఎలాగని వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికి వారి సర్టిఫికెట్లను పరిశీలించాలని, తుది నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ 137 మంది సర్టిఫికెట్లనూ అక్టోబర్ 5న పరిశీలించారు. - మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 250 మంది దాకా గైర్హాజరు కాగా, వారి స్థానంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారిని ఎంపిక చేసేందుకు అక్టోబర్ 14న వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. దాదాపు ఎస్సీ విద్యార్థులు 200 మంది, ఎస్టీ విద్యార్థులు పదుల సంఖ్యలో హాజరయ్యారు. మూడు వారాలు గడిచినా వారికి ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) రాకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేకపోయారు. ఓటీపీ వస్తేనే ఆన్లైన్లో కోచింగ్ సెంటర్‌ను ఎంపిక చేసుకునే వీలుంటుంది. 2017 జూన్ 18న ప్రిలిమినరీ పరీక్ష సివిల్ సర్వీసెస్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. యూపీపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్ష 2017 జూన్ 18న నిర్వహించనున్నారు. శిక్షణ తొమ్మిది నెలలైతే పరీక్ష గడువు 7 నెలలు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు నెలల శిక్షణ కోల్పోయామని, వెంటనే రెండో జాబితాను ఖరారు చేసి శిక్షణకు పంపించాలని అభ్యర్థులు రాము, రుషికేష్, ముత్యాలప్ప, సాయినాథ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్నను వివరణ కోరగా... ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని, అంతా డైరెక్టరేట్ కార్యాలయం వారు, కాకినాడ జేఎన్టీయూ వారే చూస్తున్నారని ఆయన తెలిపారు. -
ఇప్పట్లో భారత్‌తో క్రికెట్ సాధ్యం కాదు
పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ కరాచీ: భారత్‌తో క్రికెట్ సిరీస్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొందని గుర్తుచేశారు. ‘ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ జరగాలంటే అంతకన్నా ముందు ఇతర సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. నాకైతే ఇప్పట్లో మ్యాచ్‌లు జరుగుతాయని అనిపించడం లేదు. అయితే ఈ విషయంలో పూర్తి వివరాలు పీసీబీ చెప్పాల్సి ఉంటుంది’ అని అజీజ్ తెలిపారు. -
ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లిన కెసిఆర్!
టిఆర్ఎస్ శాసనసభ్యుల ఆశలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నీళ్లు చల్లారు. మంత్రి వర్గం విస్తరణ ఉంటుందని, అందులో తమకూ అవకాశం ఉంటుందని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మహిళలు, ప్రాతినిధ్యంలేని జిల్లాల వారు, సామాజిక వర్గాల వారు ఎవరి అంచానాలు వారు వేసుకుంటున్నారు. ఎవరికి వారు తమకు మంత్రి పదవి వస్తుందంటే, తమకు వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం లేదని కెసిర్ సంకేతాలు ఇచ్చారు. దాంతో పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు నీరుగారిపోయారు. తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఈనెల 15లోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఆశించారు. వారి ఆశలు ఇప్పట్లో తీరే అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రివర్గలో ప్రాతినిధ్యం లేని మహబూబ్‌నగర్‌లో మంత్రి కెటిఆర్, ఖమ్మంలో పద్మారావు స్వాతంత్ర్యదినోత్సవాలకు హాజరవుతారని ప్రకటించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ లేదని అందరికీ అర్ధమైపోయింది. ప్రస్తుత స్థితిలో మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే 15 మంది రేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేపడితే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సిఎం భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే పూర్తి స్థాయి మంత్రి మండలి ఏర్పాటును వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఈనెల 20న కెసిఆర్ సింగపూర్ వెళ్ళనున్నారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత వచ్చే నెలలో దాదాపు నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత కెసిఆర్ పార్టీపై దృష్టి పెడతారు. అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ బాధ్యతలు సమర్ధంగా నిర్వహించిన వారినే మంత్రివర్గంలో చేర్చుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కొద్దినెలల పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. - శిసూర్య