
కర్ణాటక సంగీతంలో... అని రాయబోయి పొరబాటున ‘పొగరు’ అని రాశారనుకుంటున్నారేమో! అక్కడ రాసింది... మీరు చదివింది... కరెక్టే. అది పొగరే! కర్ణాటక ప్రేక్షకులకు తన నటనలోని పొగరేంటో చూపించనున్నారు శ్రుతీహాసన్. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కనిపించిన శ్రుతి, త్వరలో కన్నడ సినిమాలోనూ కనిపించనున్నారు.
ఆమె ఓ కన్నడ సినిమా అంగీకరించారు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో ధ్రువ్ సరసన శ్రుతి నటించనున్నారు. ధ్రువ్ హీరోగా నటిస్తున్న ‘పొగరు’లో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్రదర్శకుడు నందకిశోర్ తెలిపారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ నెల్లోనే శ్రుతి కూడా ఈ షూటింగులో పాల్గొంటారట!!
Comments
Please login to add a commentAdd a comment