మరోసారి జోడీ? | Shruthi Haasan to romance Ravi Teja | Sakshi
Sakshi News home page

మరోసారి జోడీ?

Published Mon, Jun 3 2019 1:23 AM | Last Updated on Mon, Jun 3 2019 10:43 AM

Shruthi Haasan to romance Ravi Teja - Sakshi

‘బలుపు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రవితేజ–శృతీహాసన్‌ మరోసారి జోడీ కడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘బలుపు’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం విడుదలైన ఆరేళ్లకు మళ్లీ రవితేజ–శృతీహాసన్‌ జంటగా నటించనున్నారట. అయితే ఈ సినిమాకి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తుండటం విశేషం. గతంలో రవితేజ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ‘డాన్‌శీను, బలుపు’ సినిమాలొచ్చాయి.

ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌పై కన్నేశారు. వాస్తవ సంఘటనల నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ చివరిదశకు చేరిందట. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవగానే ఈ చిత్రంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇందులో రవికి జోడీగా శృతిని తీసుకోవాలని యూనిట్‌ ఇప్పటికే ఆమెను సంప్రదించగా నటించేందుకు ఎగై్జట్‌గా ఉన్నారని సమాచారం. 2017లో వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు శృతి. ఆ మధ్య తన బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సలేను పెళ్లి చేసుకోనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌కి ‘బ్రేకప్‌’ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో శృతీహాసన్‌ మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement