
శ్రుతీహాసన్
కొత్త సినిమాలు సంతకం చేయడం లేదు. కేవలం టీవీ షో మాత్రమే చేస్తోంది. ఇది చాలదా గాసిప్‌రాయుళ్లకు శ్రుతీహాసన్ పెళ్లికి శుభముహూర్తం పెట్టడానికి. అదే చేసేశారు. శ్రుతీ 2019లో తన లండన్ బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ కోర్సలేను పెళ్లి చేసుకోబోతోంది అని రాసుకొచ్చారు. ఈ వార్త శ్రుతీ చెవిలో కూడా పడింది. వెంటనే ‘ఏంటి నిజమా? ఇది నాకూ వార్తే’ అంటూ ట్వీట్ చేశారు. మైఖేల్, శ్రుతీ కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఔత్సాహికులు రాసుకొచ్చినట్టు శ్రుతీహాసన్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా? ఆవిడ కొట్టిపారేసినట్టే ఈ ఏడాది ప్రేమలోనే మునిగి తేలుతూ జీవితాన్ని ఆస్వాదిస్తారా? వేచి చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment