'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా? | Actor Naveen Polishetty Reacts On His Secret Wedding Rumours, Deets Inside | Sakshi
Sakshi News home page

Naveen Polishetty Marriage Rumours: పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

Published Tue, Aug 6 2024 2:04 PM | Last Updated on Tue, Aug 6 2024 3:19 PM

Actor Naveen Polishetty Wedding Rumours

'జాతిరత్నాలు' అనగానే నవీన్ పొలిశెట్టి గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. దీని తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అని మరో మూవీ చేశాడు. దీంతో కూడా హిట్ కొట్టాడు. ఇదొచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం చేతికి గాయం కావడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇతడికి పెళ్లయిపోయిందనే రూమర్ తెగ వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'దేవర' పాటపై కాపీ ట్రోల్స్.. నిర్మాత ట్వీట్ వైరల్)

'మిస్ శెట్టి మిస్టర్  పొలిశెట్టి' రిలీజ్ టైంలో అమెరికా వెళ్లిన నవీన్.. చాలారోజుల నుంచి అక్కడే ఉన్నాడు. మొన్నీమధ్య ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ జరగడంతో చేతికి కట్టుతో కనిపించాడు. తన గాయం గురించి కొన్ని రోజుల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసి, తనకేం పర్లేదని త్వరలో కోలుకుంటానని కూడా చెప్పాడు.

అయితే అమెరికాలో నవీన్ ఓ అమ్మాయిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడని, అందుకే చాలారోజుల నుంచి అక్కడే ఉండిపోయాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నవీన్.. అలాంటిదే లేదని, తనకు పెళ్లి జరిగితే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పాడు. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement