'దేవర' పాటపై కాపీ ట్రోల్స్.. నిర్మాత ట్వీట్ వైరల్ | Devara Movie New Song Producer Naga Vamsi Comments | Sakshi
Sakshi News home page

Devara Song: దేనితో కంపేర్ చేస్తే మనకేంటి? నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్

Published Tue, Aug 6 2024 1:37 PM | Last Updated on Tue, Aug 6 2024 3:07 PM

Devara Movie New Song Producer Naga Vamsi Comments

రీసెంట్‌గా రిలీజైన 'దేవర' రెండో పాటపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సూపర్ అదిరిపోయిందని కానీ బాగాలేదని కానీ అనట్లేదు. అదే టైంలో ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో పోలుస్తున్నారు. రెండింటి ట్యూన్స్ చాలా దగ్గరగా ఉన్నాయని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడిది కాస్త నిర్మాత నాగవంశీ వరకు చేరింది. పాటపై వస్తున్న ట్రోల్స్ గురించి పాటలో తారక్-జాన్వీ కెమిస్ట్రీ గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

(ఇదీ చదవండి: ఓయో రూమ్‌లో తెలుగు డైరెక్టర్‌ ఆత్మహత్య)

'గత 24 గంటల నుచి 'చుట్టమల్లే' సాంగ్ లూప్‌లో ఉంది. హౌ ఈజ్ ద జోష్ బాయ్స్? తారక్ అన్నని చూస్తుంటే ముచ్చటేస్తోంది. జాన్వీని చూస్తుంటే ముద్దొచ్చేస్తోంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి కదా బాయ్స్' అని నాగవంశీ ట్వీట్ చేశారు.

'దేవర' నైజాం హక్కుల్ని సితార నిర్మాణ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగవంశీ.. 'దేవర' కంటెంట్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు ట్వీట్స్ వేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. ఇకపోతే ఈ సినిమా.. సెప్టెంబరు 27న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటివరకు రెండు పాటలు మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ వస్తుందోనని ఫ్యాన్స్ వెయిటింగ్.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement