
టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు కొమారి జానయ్య నాయుడు (44) ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగులో పలు చిన్న సినిమాలకు దర్శకత్వం, నిర్మాతగా ఆయన కొనసాగారు. అయితే, కూకట్‌పల్లిలో భాగ్య నగర్ కాలనీలో ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్కు ఉరేసుకొని జానయ్య మరణించారు. అయితే, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌లో ‘జీఎస్టీ’ (గాడ్ సైతాన్ టెక్నాలజీ) అనే సినిమాను కొమరి జానయ్య నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించారు.
ఉండేందుకు రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆయన చెక్ ఆవుట్ చేయాల్సిన సమయం పూర్తి కావడంతో లాడ్జి సిబ్బంది గది తలుపులు కొట్టగా జానయ్య ఓపెన్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా ఆయన ఫ్యాన్‌కు వేలాడుతు కనిపించాడు. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న వారు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఆయన ఈ లాడ్జ్‌కు ఒక్కడే వచ్చాడా..? ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment