
న్యూ ఇయర్ వచ్చేసింది. గడచిన సంవత్సరం ఎలా గడిచింది? అని విశ్లేషించుకుంటూ ఈ ఏడాది ఎలా ఉండాలో కోరుకుంటూ బిజీగా ఉన్నారు చాలామంది. శ్రుతీహాసన్ ఏమంటున్నారంటే.. ‘‘ఎలా జీవించాలో నాకు నేర్పుతున్న ప్రతి ఏడాదికి థ్యాంక్స్. కాలం నాలో తెచ్చిన మార్పులకు థ్యాంక్స్. నాలో నన్ను వెతుక్కునే అవకాశం కల్పించి, నన్ను నేను ప్రేమించుకునేలా చేసిన టైమ్‌కి థ్యాంక్స్. అలాగే 2019 కూడా నన్ను ఎగై్జట్ చేసే ఎన్నో అంశాలను నా ముందుకు తీసుకురావాలి.
నాకు నచ్చిన విషయాలను ఎంపిక చేసుకునే అవకాశాలను ఇవ్వాలి. నా సంతోషంలో గతేడాది భాగమైన నా బంధుమిత్రులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఆమె తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో కలిసి లండన్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక శుత్రి సినిమాల విషయానికి వస్తే.. హిందీలో విద్యుత్ జమాల్ సరసన ఆమె ఓ సినిమా చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకుడు.