
శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే
‘‘నీతో సావాసం ప్రతిరోజు ఓ సరికొత్త సాహసం చేసినట్లుగా అనిపిస్తోంది మైఖేల్’’ అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేని పొగడ్తలతో ముంచెత్తారు శ్రుతీహాసన్. మైఖేల్, శ్రుతీ ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ కోడై కూసినా వీళ్లు మాత్రం ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనే తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి చెబుతున్నారు. రీసెంట్‌గా మైఖేల్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన శ్రుతీ – ‘‘నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో ప్రతి రోజూ చూపిస్తున్నావు. చిన్న చిన్న విషయాలకు నవ్వుకోవడాలు, చాటింగ్ చేసుకోవడం... ఎంత దూరమైనా కలసి నడవడం అన్నీ బావున్నాయి’’ అన్నారు శ్రుతీ.
Comments
Please login to add a commentAdd a comment