ఇట్టా చెట్టా పట్టాలేసుకుని..! | Shruti Haasan And Rumoured Boyfriend Michael Corsale Spend Time Together In Mumbai | Sakshi
Sakshi News home page

ఇట్టా చెట్టా పట్టాలేసుకుని..!

Published Thu, Apr 19 2018 12:44 AM | Last Updated on Thu, Apr 19 2018 12:44 AM

Shruti Haasan And Rumoured Boyfriend Michael Corsale Spend Time Together In Mumbai - Sakshi

మైఖేల్‌ కోర్సలేతో శ్రుతీహాసన్‌

‘మీ పెళ్లి ఎప్పుడు?’ అని శ్రుతీహాసన్‌ను అడిగితే ‘ఆ ఒక్కటీ అడగద్దంటూనే, ఇతరుల పర్సనల్‌ లైఫ్‌ని గౌరవించండి’ అని కాస్త ఘాటుగా మాట్లాడతారు. కానీ సెలబ్రిటీల విషయాలను తెలుసుకునేవాళ్లు ఈ మాట విని ఆగుతారా? ఊహూ.. చాన్సే లేదు. లండన్‌కి చెందిన మైఖేల్‌ కోర్సలేతో శ్రుతి లవ్‌లో ఉన్నారని ఈ ఇద్దర్నీ అక్కడక్కడా చూసినవాళ్లు ఊహిస్తున్నారు.

ఆ ఊహలకు తగ్గట్టుగా మైఖేల్‌తో శ్రుతి బాహాటంగానే చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ మధ్య ఓ పెళ్లిలో, అలాగే తల్లి సారికతో, ఓసారి షాపింగ్‌ మాల్‌లో మైఖేల్‌తో కనిపించారు శ్రుతి. తాజాగా, ఈ ఇద్దరూ ప్రేమపక్షుల్లా విహరిస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. మరి ఈ జంట ఏడడుగులు ఎప్పుడు వేస్తారో? అని ఔత్సాహికరాయుళ్లు మాట్లాడుకుంటున్నారు. సినిమాల సంగతికొస్తే... ఈ అమ్మడు విద్యుత్‌ జమాల్‌ హీరోగా రూపొందనున్న ఓ హిందీ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement