కూతురి ఎఫైర్.. ప్రముఖ హీరో ఆందోళన | Kamal Haasan worried about Shruti's relationship with Michael Corsale? | Sakshi
Sakshi News home page

కూతురి ఎఫైర్.. ప్రముఖ హీరో ఆందోళన

Published Tue, Mar 14 2017 2:45 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

కూతురి ఎఫైర్.. ప్రముఖ హీరో ఆందోళన

కూతురి ఎఫైర్.. ప్రముఖ హీరో ఆందోళన

చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన కూతురు, నటి శృతి హాసన్.. మిస్టరీ మ్యాన్ మైఖేల్ కొర్సలేతో ఎఫైర్‌ సాగిస్తోందని వచ్చిన వార్తలపై ఆందోళన చెందుతున్నారట. శృతి హాసన్, మైఖేల్ కలిసున్న ఫొటోలు ఇటీవల మీడియాలో వచ్చాయి. గత నెలలో వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంట పడ్డారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఇద్దరికీ రిలేషన్‌షిప్ ఉందని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయం కమల్ హాసన్ దృష్టికి రావడంతో ఆయన కలత చెందినట్టు సన్నిహితులు చెప్పారు.

మైఖేల్‌తో శృతి ఇలా బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరగడం పట్ల కమల్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇలాంటి కథనాలు మీడియాలో రావడం వల్ల ప్రతిష్ట దెబ్బతింటుందని కమల్ భావిస్తున్నారని, ఈ విషయం గురించి శృతితో మాట్లాడారని సన్నిహితులు చెప్పారు. లండన్‌లోని ప్రఖ్యాత డ్రామా సెంటర్‌లో మైఖేల్ గ్రాడ్యుయేషన్ చేశాడు. కాగా గతంలో కూడా శృతి ఎఫైర్ల గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్‌ తాజా సినిమాలో కాటమరాయుడులో ఆమె హీరోయిన్‌గా నటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement