నాన్నా.. ఒక్కసారి పిలవొచ్చా : స్టాలిన్‌ భావోద్వేగం | DMK Leader Stalin Emotional Letter To His Departed Father Karunanidhi | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 8 2018 5:26 PM | Last Updated on Wed, Aug 8 2018 7:21 PM

DMK Leader Stalin Emotional Letter To His Departed Father Karunanidhi - Sakshi

నా నోటితో ఎక్కువ సార్లు నాన్నా అని పిలవలేకపోయా..

చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపట్ల ఆయన కుమారుడు, పార్టీ నాయకుడు ఎంకే స్టాలిన్‌ విషాదాన్ని వ్యక్తం చేస్తు భావోద్వేమైన లేఖను రాశారు. చివరిసారిగా ఒక్క సారి నాన్నా(అప్పా).. అని పిలవనా అంటూ బుధవారం ఉద్వేగపూరితమైన లేఖ రాశారు.

ఆ లేఖలో ఏం ఉందంటే.. ‘ అప్పా(నాన్న) ..అప్పా అని పిలిచేబదులు మిమ్మల్ని మా నాయకుడు(తలైవార్) అనే ఎక్కువ సార్లు పిలిచేవాడిని. చివరి సారిగా ఒక్క సారి నాన్నా అని పిలువనా లీడర్‌. ఎక్కడి వెళ్లాల్సివచ్చినా  మాకు ముందే సమాచారం ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయావు. 33 ఏళ్ల క్రితం సమాధి గురించి మీరు చెప్పిన వాఖ్యలు నాకు బాగా గుర్తుకు ఉన్నాయి. ఎవరైతే విశ్రాంతి లేకుండా పని చేస్తారో వారు ఇక్కడ(సమాధి) విశ్రాంతి పొందుతారు’ అని చెప్పారు. మీరు తమిళ ప్రజల కోసం విశ్రాంతి లేకుండా కృషి చేసి సంతృప్తితో అక్కడికి(సమాధి) సేద తీరడానికి వెళ్లారని ఆశిస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.

సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్‌ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement