తల్లి శ్రీదేవితో జాన్వీ
శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ అంతరంగం ఇది. తల్లంటే తనకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో జాన్వీ ఎమోషనల్‌గా రాసిన ఈ లెటర్ చదివితే అర్థమవుతుంది.
‘‘ఒక రకమైన బాధతో నా హృదయం నిండిపోయి ఉంది. అలాంటి ఆవేదనతోనే ఇకపై బతకటం నేర్చుకోవాలని నాకు అర్థం అవుతోంది. ఇలాంటి స్తబ్దమైన పరిస్థితుల్లో కూడా.. నీ ప్రేమను నేను ఫీలవ్వగలుగుతున్నాను. ఇంత బాధలోను, దుఃఖంలోను కూడా.. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావనిపిస్తోంది. కనురెప్పలు మూసిన ప్రతిసారీ నీతో గడిపిన మధుర క్షణాలే గుర్తొస్తున్నాయి. నాకు తెలుసు అలా చేస్తుంది నువ్వే అని. నువ్వు మా జీవితాలకు దొరికిన వరం. మాలో ఒకదానిగా ఉండటం నిజంగా మా వరమనే భావిస్తున్నాను. అసలు నువ్వీ లోకంలో ఉండటానికి అర్హురాలివి కాదు. ఎందుకంటే యూ ఆర్ టూ గుడ్, టూ ప్యూర్ అండ్ మనస్సు నిండా ప్రేమతోనే నిండిపోయి ఉన్నదానివి. అందుకే.. ఆ దేవుడు అంత త్వరగా నిన్ను మా నుంచి లాగేసుకున్నాడు.
నా ఫ్రెండ్స్ ఎప్పుడూ అంటుండేవారు ‘నువ్వెప్పుడూ సంతోషంగా కనిపిస్తావు’ అని. నాకా విషయం ఇప్పుడు అర్థం అవుతోంది. ఆ సంతోషం అంతా నీవల్లే అని. నన్ను ఎవరేమన్నా బాధ కలగలేదు, ఏ సమస్య కూడా పెద్ద సమస్యగా అనిపించలేదు, ఏ ఒక్క రోజు కూడా డల్‌గా అనిపించింది లేదు. ఎందుకంటే నువ్వున్నావ్, నన్ను ప్రేమగా చూసుకునే నువ్వున్నావ్. నాకెవ్వరి మీద, దేని మీదా ఆధారపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే నువ్వున్నావ్. నేను బాగా కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నా సోల్‌లో నువ్వు కూడా ఒక భాగం. మై బెస్ట్ ఫ్రెండ్. నీ జీవితమంతా మాకు ఇస్తూనే ఉన్నావ్. ఇప్పుడు నేను కూడా నీకు అదే చేయదలిచాను. నువ్వు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తాను.
నేనెలా అయితే నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నానో, నువ్వు కూడా నన్ను చూసి అలానే ఫీల్ అవ్వాలి అనే హోప్‌తో ప్రతి రోజూ నిద్ర లేచేదాన్ని. నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై కూడా అదే హోప్‌తో నిద్రలేస్తాను. ఎందుకంటే.. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. నేనది ఫీల్ అవ్వగలను. నువ్వు నాలోను, ఖుషీలోను, డాడీలోను మా అందరిలోనూ ఉన్నావు. నువ్వు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు మాలో ఎంత బలంగా ముద్రించుకుపోయాయి అంటే.. అవి చాలు మమ్మల్ని ముందుకు నడపటానికి. కానీ అవి చాలవుగా నీ లోటు తీర్చటానికి’’. ఐ లవ్ యూ మై ఎవ్రీథింగ్
– జాన్వీ కపూర్
Comments
Please login to add a commentAdd a comment