Jahnvi
-
జాహ్నవి కాలేజీలో బతుకమ్మ సంబురాలు (ఫోటోలు)
-
శ్రీ దేవి దారిలో జాన్వీ కపూర్..!
-
ఆస్తులు అమ్మేస్తున్న శ్రీదేవి భర్త!
సీనియర్ సినీ నిర్మాత బోనీ కపూర్, అతని కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ముంబైలోని అంధేరి శివారులో ఉన్న తమ నాలుగు అపార్ట్మెంట్లను విక్రయించినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో రెండు ఫ్లాట్లను రూ. 6.02 కోట్లకు విక్రయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్ 2 నమోదైనట్లు తెలుస్తోంది. రెండు అపార్ట్మెంట్లు లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. రెండు ఫ్లాట్ల విస్తీర్ణం 1870.57 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్లు ఒక ఓపెన్ కార్ పార్కింగ్తో వస్తాయి. ఈ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు సిద్ధార్థ్ నారాయణ్, అంజు నారాయణ్‌గా చెబుతున్నారు. అదే కాంప్లెక్స్‌లో ఉన్న మరో రెండు అపార్ట్మెంట్లను వారు మరో రూ. 6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2023 అక్టోబర్ 12 న జరిగినట్లు సమాచారం. 1614.59 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు రెండు కార్ పార్కింగ్‌లతో వస్తాయి. వీటిని ముస్కాన్ బహిర్వానీ, లలిత్ బహిర్వానీలకు విక్రయించినట్లు సమాచారం. 2022లో బోనీ, జాన్వీ, ఖుషీలు 65 కోట్ల రూపాయల విలువైన బాంద్రాలో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 6421 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇందులో ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే.. గతంలో ఆస్తులు విక్రయించిన సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఖరీదైన ప్లాట్లను కొనుగోలు చేయడం, విక్రయించడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం నటుడు 'రణవీర్ సింగ్' ముంబైలోని ఒక లగ్జరీ టవర్లోని రెండు ఫ్లాట్లను రూ.15.24 కోట్లకు విక్రయించాడు. నవంబర్‌లో నటి 'ప్రియాంక చోప్రా' ఓషివారాలోని లోఖండ్వాలా కాంప్లెక్స్‌లో 2,292 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను రూ. 6 కోట్లకు విక్రయించింది. -
ఎందుకంటే నువ్వున్నావ్..
శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ అంతరంగం ఇది. తల్లంటే తనకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో జాన్వీ ఎమోషనల్‌గా రాసిన ఈ లెటర్ చదివితే అర్థమవుతుంది. ‘‘ఒక రకమైన బాధతో నా హృదయం నిండిపోయి ఉంది. అలాంటి ఆవేదనతోనే ఇకపై బతకటం నేర్చుకోవాలని నాకు అర్థం అవుతోంది. ఇలాంటి స్తబ్దమైన పరిస్థితుల్లో కూడా.. నీ ప్రేమను నేను ఫీలవ్వగలుగుతున్నాను. ఇంత బాధలోను, దుఃఖంలోను కూడా.. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావనిపిస్తోంది. కనురెప్పలు మూసిన ప్రతిసారీ నీతో గడిపిన మధుర క్షణాలే గుర్తొస్తున్నాయి. నాకు తెలుసు అలా చేస్తుంది నువ్వే అని. నువ్వు మా జీవితాలకు దొరికిన వరం. మాలో ఒకదానిగా ఉండటం నిజంగా మా వరమనే భావిస్తున్నాను. అసలు నువ్వీ లోకంలో ఉండటానికి అర్హురాలివి కాదు. ఎందుకంటే యూ ఆర్ టూ గుడ్, టూ ప్యూర్ అండ్ మనస్సు నిండా ప్రేమతోనే నిండిపోయి ఉన్నదానివి. అందుకే.. ఆ దేవుడు అంత త్వరగా నిన్ను మా నుంచి లాగేసుకున్నాడు. నా ఫ్రెండ్స్ ఎప్పుడూ అంటుండేవారు ‘నువ్వెప్పుడూ సంతోషంగా కనిపిస్తావు’ అని. నాకా విషయం ఇప్పుడు అర్థం అవుతోంది. ఆ సంతోషం అంతా నీవల్లే అని. నన్ను ఎవరేమన్నా బాధ కలగలేదు, ఏ సమస్య కూడా పెద్ద సమస్యగా అనిపించలేదు, ఏ ఒక్క రోజు కూడా డల్‌గా అనిపించింది లేదు. ఎందుకంటే నువ్వున్నావ్, నన్ను ప్రేమగా చూసుకునే నువ్వున్నావ్. నాకెవ్వరి మీద, దేని మీదా ఆధారపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే నువ్వున్నావ్. నేను బాగా కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నా సోల్లో నువ్వు కూడా ఒక భాగం. మై బెస్ట్ ఫ్రెండ్. నీ జీవితమంతా మాకు ఇస్తూనే ఉన్నావ్. ఇప్పుడు నేను కూడా నీకు అదే చేయదలిచాను. నువ్వు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తాను. నేనెలా అయితే నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నానో, నువ్వు కూడా నన్ను చూసి అలానే ఫీల్ అవ్వాలి అనే హోప్‌తో ప్రతి రోజూ నిద్ర లేచేదాన్ని. నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై కూడా అదే హోప్‌తో నిద్రలేస్తాను. ఎందుకంటే.. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. నేనది ఫీల్ అవ్వగలను. నువ్వు నాలోను, ఖుషీలోను, డాడీలోను మా అందరిలోనూ ఉన్నావు. నువ్వు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు మాలో ఎంత బలంగా ముద్రించుకుపోయాయి అంటే.. అవి చాలు మమ్మల్ని ముందుకు నడపటానికి. కానీ అవి చాలవుగా నీ లోటు తీర్చటానికి’’. ఐ లవ్ యూ మై ఎవ్రీథింగ్ – జాన్వీ కపూర్ -
సన్యాసి మొగుడు
ఏమిటో ఈ పెళ్లిళ్లు... తల్లిదండ్రులు ఎంతో కష్టపడి.. జాతకాలు, గుణగణాలు, కుటుంబాలు కలిసేలా ఓ అబ్బాయిని చూసి ఆ అయ్య చేతిలో కూతురిని పెడితే.. ఎన్ని రకాల సమస్యలో! వాదించే వాళ్లు.. వేధించే వాళ్లు.. వారించే వాళ్లు! ఇవన్నీ కాకపోతే ఇదో కొత్త నమూనా... సన్యాసి మొగుడు! ఈ పీడకల నుంచి బయడ్డానికి విడాకులు దొరుకుతాయా? తన లైఫ్‌కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని గుడ్డిగా కుటుంబానికే వదిలేసి.. కనీసం పెళ్లి చూపులు అప్పుడన్నా భరద్వాజ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయని తన తెలివి తక్కువతనానికి చింతించింది జాహ్నవి.‘మంచి సంబంధం... సంప్రదాయ కుటుంబం... అంటూ దాని గొంతు కోశారు.. బంగారంలాంటి పి...ల్ల’ ఉబికి వస్తున్న దుఃఖాన్ని చీరకొంగును నోట్లో కుక్కుకుని ఆపుకుంటూ బాధపడుతోంది జాహ్నవి తల్లి! ‘ఇది మరీ బాగుందే తల్లి.. దిగే వరకు మాకు మాత్రం లోతు తెలిసిందా? వాకబు చేసిన వాళ్లంతా మంచి వాళ్లనే చెప్పారు. అయినా దానికి మేమేమైనా శత్రువులమా? అది బాగుండాలనే కదా అనుకుంది!’ అంది ఉక్రోషం, నిష్ఠూరం కలగలసిన స్వరంతో జాహ్నవి నానమ్మ. మనవరాలికి జరిగిన అన్యాయంలో కోడలు తనను బాధ్యురాలిని చేయడం వల్ల పలికిన భావోద్వేగం అది. ‘ఆ మాటకొస్తే నేనొక్కదాన్నే పట్టుబట్టలేదు కదా ఈ సంబంధం గురించి మీ అమ్మ, మీ తమ్ముడూ చూశారు’ అంది. మళ్లీ అదే నిష్ఠూరం.. ఈసారి తన పొరపాటులో భాగస్వామ్యం పంచే ప్రయత్నం! ‘మా అమ్మనూ అంటునాన్లెండి’ అంది జాహ్నవి తల్లి. ‘నీ కూతురు మీద మాకేం పగా ద్వేషాలు లేవు... మంచి కుర్రాడొస్తే బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో పెద్దవాళ్లం చూశాం. ఘోరమైన తప్పిదం జరిగిపోయింది. మమ్మల్ని క్షమించు తల్లీ.. క్షమించు’ అంటూ చెంపల మీద టపటపా కొట్టుకుంది జాహ్నవి అమ్మమ్మ. ‘అమ్మా.. ఆపుతావా? కూతురి జీవితం నాశనమైందనే బాధలో ఏదో అంటోంది అక్క... పెద్దవాళ్లు కాస్త ఓపికగా ఉండండి. ఇప్పుడేం చేయాలో ఆలోచించండి’ సర్దిచెప్పాడు జాహ్నవి మేనమామ. ‘ఇంక మీ జోక్యం వద్దు మామయ్యా. జరగాల్సింది నేను చూసుకుంటాను. నా మానాన నన్ను వదిలేయండి. మిమ్మల్ని తప్పు పట్టో, మీమీద నమ్మకం లేకో అనట్లేదు. నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నన్ను తీసుకోనివ్వండి. ఈ మాటలతో మీరు బాధపడితే క్షమించండి’ అని నిక్కచ్చిగా చెప్పేసి బయటకు వెళ్లిపోయింది జాహ్నవి. అసలు ఏమైంది? ఇద్దరన్నదమ్ముల మధ్య ఆడపిల్ల. అపురూపంగా పెరిగింది. ఏం కావాలన్నా కాదనలేదు అమ్మానాన్న. ఇంటర్ అయిపోయాక ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానంది. నాన్నకు ఇష్టంలేకపోయినా తన కోసం ఓకే అన్నారు. ఎంతో ఆసక్తితో ఆ కోర్స్‌ను పూర్తి చేసింది. ఇంటర్న్‌షిప్ కోసం ముంబైకి వెళ్లింది. తన అభిరుచికి పేరెంట్స్ ఓకే... వాళ్ల కోసం పెళ్లికి తానూ ఒకే... ఓ యేడాది పాటు అక్కడున్న ప్రముఖ డిజైనర్లందరి దగ్గరా పనిచేసి వచ్చింది. ఆ అనుభవంతో హైదరాబాద్‌లో సొంత బొటిక్ ఒపెన్ చేసింది. బొటిక్ పెట్టడం అమ్మానాన్న సహా అన్నయ్యకూ ఇష్టం లేదు. వద్దు అంటే చిన్నబుచ్చుకుంటుందేమోనని అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నారు. మేనత్తలు, మేనమామ భార్య, పిన్ని అందరూ ‘ముంబై వెళ్లింది ఇక్కడ టైలర్ షాప్ ఓపెన్చేయడానికా? నాలుగేళ్లు మెషీన్ తొక్కుడేనా నేర్చుకుంది’ అంటూ ఎక్కసెక్కాలు ఆడినా తన కోసం సహించారు. తను మాత్రం ఏమీ పట్టించుకోకుండా శక్తియుక్తులన్నీ బొటిక్ మీద పెట్టింది. రెండేళ్లలో మంచి బిజినెస్. అంతకన్నా మంచి పేరు. ఫ్యాషన్ వీక్స్‌కి ఇన్విటేషన్స్. గ్రూప్డిజైనింగ్లో చాన్సెస్. బ్రహ్మాండమైన కెరీర్. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పుడు వచ్చింది పెళ్లి ప్రస్తావన నానమ్మ నుంచి. ఇప్పటి వరకు అన్ని విషయాల్లో తన చాయిస్‌ను గౌరవించిన తన పెద్దలకు తనకు పెళ్లికొడుకునే వెదికే చాయిస్ ఇచ్చి తనూ వాళ్లను గౌరవించాలనుకుంది. అందుకే ‘మీరు చూసిన సంబంధం చేసుకుంటాను’ అని చెప్పింది. అమ్మమ్మ, నాన్నమ్మ వేట... ఆ బాధ్యతను జాహ్నవి అమ్మమ్మ, నాన్నమ్మ తీసుకున్నారు. పెళ్లికొడుకు కోసం వేట ప్రారంభించారు. చాలా సంబంధాలు చూసి చివరికి భరద్వాజను ఓకే చేశారు. ఆచార వ్యవహారాలు పాటిస్తున్న కుటుంబం. అబ్బాయి గవర్నమెంట్ లెక్చరర్. చూడ్డానికి కూడా చాలా బాగుంటాడు. నెమ్మదస్తుడు. మెతక మనిషి. పెళ్లి చూపుల్లో భరద్వాజ్‌ను చూస్తే వింతగా అనిపించింది తనకు. అంత నెమ్మదితనం ఉన్న అబ్బాయిని తాను ఎక్కడా చూడలేదు. తన స్వభావానికి పూర్తి విరుద్ధం. పోనీలే ఇద్దరూ దూకుడుగా ఉంటే కష్టం. ఒకరిలా... ఒకరు అలా ఉంటేనే బెటర్ అని సర్ది చెప్పుకుంది. వన్ మార్నింగ్... పైసా కట్నం లేకుండా పెళ్లి అయింది. అబ్బాయి దీక్షలో ఉన్నాడు... మొదటిరాత్రికి నలభై రోజులు ఆగాలి అని అబ్బాయి తరపు పెద్దలు అమ్మాయి తరపు పెద్దలకు చెప్పారు. చిత్రంగా అనిపించినా సరే అన్నారు. ఈలోపు తనకు, భరద్వాజకు మంచి స్నేహం కుదిరింది. ముందు భయపడ్డా కంపాటబులిటీ బాగా కుదిరినందుకు చాలా హ్యాపీగా ఫీలయింది. నలభై రోజుల తర్వాత తనకు ఆధ్యాత్మికంగా ఎదగాలనుందని చెప్పాడు. షాకింగ్‌గా ఫీలయింది. కాలేజ్ నుంచి రాగానే ధ్యానముద్రలో గడిపేవాడు. ఇంకోవైపు తన పెద్దల నుంచి అత్తామామల మీద ఒత్తిడీ ఎక్కువైంది గర్భాదాన ముహూర్తం కోసం. కాని ముహూర్తాలు కుదరట్లేదని జవాబు చెప్పసాగారు. తొమ్మిది నెలల తర్వాత... అలా దాదాపు తొమ్మిది నెలలు గడిచాయి. ఒక రోజు తను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే తీర్థయాత్రలు చేయాలి. అక్కడున్న స్థల పురాణాలు, ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకోవాలంటూ ఒంటరిగా తీర్థయాత్రలకు ప్రయాణమయ్యాడు. నాలుగు నెలలైనా అడ్రస్ లేదు. ఒక రోజు ఉదయం తన మామగారికి ఫోన్ వచ్చింది కొడుకు దగ్గర్నుంచి. ఎక్కడో ఉత్తర భారతంలో... ఏదో స్వామీజీ దగ్గర సన్యాసం తీసుకున్నట్టు.. ఇక తన గురించి మరచిపొమ్మన్నట్టు! నిశ్చేష్ఠురాలైంది తను. మారు మాట్లాడకుండా తల్లిగారింటికి వచ్చేసింది! జాహ్నవి నోటి వెంట ఈ కథంతా విన్న అడ్వకేట్ దీర్ఘంగా నిట్టూర్చింది. ‘ఇంత చదువుకున్న దానివి, లోకం చూసిన దానివి అతని ప్రవర్తనను ఎందుకు అంచనా వేయలేక పోయావ్? తొమ్మిది నెలల్లో కనీసం ఒక్కసారైనా ఎందుకు అనుమానం రాలేదు?’ అని అడిగింది. జాహ్నవి నుంచి ఒకే సమాధానం ‘నమ్మాను’ అని! ఆ తర్వాత చేయాల్సిన దాని గురించి చెప్పింది లాయర్. ఫాలో అయింది జాహ్నవి. భర్త వివరాలతో కోర్టులో విడాకుల కోసం కేస్ వేసి విడాకులు పొందింది. ఎన్నో ఆశలు, కలలతో మొదలైన తన వైవాహిక జీవితం అలా ముగిసినందుకు ఎవరినీ నిందించలేదు. కాని తన లైఫ్‌కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని గుడ్డిగా కుటుంబానికే వదిలేసి... కనీసం పెళ్లి చూపులు అప్పుడన్నా భరద్వాజ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయని తన తెలివి తక్కువతనానికి చింతించింది. బాధపడింది. - సరస్వతి రమ మంచి కుర్రాడొస్తే బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో పెద్దవాళ్లం చూశాం. ఘోరమైన తప్పిదం జరిగిపోయింది... మమ్మల్ని క్షమించు తల్లీ.. క్షమించు’ అంటూ చెంపల మీద టపటపా కొట్టుకుంది జాహ్నవి అమ్మమ్మ. ఈ కథంతా విన్న అడ్వకేట్ దీర్ఘంగా నిట్టూర్చింది. ఇంత చదువుకున్న దానివి, లోకం చూసిన దానివి అతని ప్రవర్తనను ఎందుకు అంచనా వేయలేక పోయావ్? తొమ్మిది నెలల్లో కనీసం ఒక్కసారైనా ఎందుకు అనుమానం రాలేదు?’ చట్టం ఏం చెబుతోంది? హిందూ వివాహ చట్టం 1955, సెక్షన్ 13 ప్రకారం.. తగిన కారణాలు, సందర్భాలు ఉన్నప్పుడు కోర్టులను ఆశ్రయించి విడాకుల డిక్రీ ద్వారా తమ వివాహాన్ని రద్దు పర్చుకోవచ్చు. సరైన కారణాలు, ఆధారాలతో భార్యభర్తల్లో ఎవరైనా ఈ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చు. విడాకుల కోసం ఈ చట్టం పదికిపైగా కారణాలను సూచించింది. అందులో ఒకటి.. దంపతుల్లో ఎవరైనా సంసార జీవితాన్ని వదిలి సన్యాసాన్ని స్వీకరించినప్పుడు ఆ కారణాన్ని చూపి విడాకులు తీసుకోవచ్చు. ఇక్కడ జాహ్నవి చేసింది అదే! ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
చరిత్ర సృష్టించిన జాహ్నవి
-
చరిత్ర సృష్టించిన జాహ్నవి
విశాఖ: పర్వతారోహణలో తెలుగు అమ్మాయి జాహ్నవి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు మూడు శిఖరాలను అధిరోహించిన జాహ్నవి తాజాగా, నాలుగో శిఖరం మౌంట్ డెనాలీని అమెరికాలో అధిరోహించింది. 6190 మీటర్ల ఎత్తున్న డెనాలీ.. జాహ్నవి అధిరోహించిన అతి క్లిష్టమైన శిఖరం. గతంలో కశ్మీర్ లేహ్ ప్రాంతంలోని 20 వేల అడుగుల ఎత్తున్న స్టాక్ కంగ్రి శిఖరాన్ని అధిరోహించిన 12 ఏళ్ల పిన్న వయస్కురాలిగా జాహ్నవి ఘనత సాధించింది కూడా. మౌంట్ డెనాలిని ఇప్పటివరకూ భారత్ నుంచి ఆరుగురే అధిరోహించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య ఆమె ఆ శిఖరాన్ని అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించింది. కాగా మౌంట్ డెనాలి 20,308 అడుగుల ఎత్తుతో మౌంట్ ఎవరెస్ట్ కంటే భయంకరమైనది. 2017 ఏడాది ముగిసే లోపు ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహిస్తే ఆ ఘనత సాధించిన పిన్న వయస్కురాలి రికార్డు జాహ్నవి వశం అవుతుంది. తన ప్రయత్నం జయప్రదం అయ్యేందుకు స్పాన్సర్లు, సర్కారు చేయూత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. చదవండి... (నాన్నకు ప్రేమతో...) -
నాన్నకు ప్రేమతో...
గడ్డకట్టించే శీతలం.. అడుగు తీసి అడుగువేయలేనంత మంచు.. నిమిషాల్లో మారిపోయే శిఖరాగ్ర వాతావరణం.. అయినా సరే, ఆ అడుగులకు ఏవీ అడ్డు కాలేదు. ఆ తపనకు ఏదీ అడ్డురావడం లేదు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని.. భారతీయ ఆత్మను కవచంగా చేసుకొని.. ప్రపంచంలోని ఎత్తై పర్వతాలను అధిరోహిస్తూనే ఉంది. ఆ పర్వతారోహకురాలే... జాహ్నవి శ్రీపెరంబుదూరు. చిన్న వయసులోనే ప్రపంచంలోని ఎత్తై శిఖరాలన్నింటిని అధిరోహించాలని దీక్ష పట్టిన జాహ్నవి ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహణకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పుడు తన వయసు పద్నాలుగు. నలభై కేజీల బరువున్న ఈ ఎర్లీ టీనేజ్ అమ్మాయి అంతకు రెట్టింపు బరువును భుజాల మీదకు ఎత్తుకొని అవలీలగా పర్వతాలను ఎక్కుతూ ‘భారత్ అమ్మాయిలు ఎంత బలవంతులో చూడండి’ అని నిరూపిస్తోంది. ఇప్పటికే ‘మిషన్ 7 సమ్మిట్’ కార్యక్రమం మొదలుపెట్టిన జాహ్నవి ఆఫ్రికాలోని అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని, యూరోప్‌లోని అతి ఎత్తై ఎలబ్రుస్ పర్వతాన్ని ఎక్కి రికార్డులు సొంతం చేసుకుంది. వీటితో పాటు ‘అస్సీ 10 ఛాలెంజ్’గా పిలిచే పది ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించి మరో సరికొత్త రికార్డును సాధించింది. ఇటీవలే ఆస్ట్రేలియాలోని ఎత్తయిన ‘మౌంట్ కొసియుజ్కో’ పర్వతంపై కాలుమోపి భారతీయుల్లో ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. అధిరోహణం మొదలైంది ఇలా... జాహ్నవి తండ్రి కృష్ణారావు మానసిక వైద్యుడు. తల్లి సరస్వతి ఉపాధ్యాయురాలు. తండ్రి పర్వతారోహకుడు కూడా కావడంతో కూతురిలో శిఖరమంత ఆశయాలను నింపాడు. జాహ్నవికి రెండేళ్ల వయసు ఉండగానే తనతో పాటు కొండల మీదకు ట్రెక్కింగ్‌కు తీసుకువెళ్లేవాడు. కొడుకు ఉన్నప్పటికీ కూతురినే ఈ లక్ష్యసాధనకు ఎంచుకోవడానికి కారణాలను వివరిస్తూ - ‘భారతీయ స్త్రీలు పర్వతారోహణలో వెనుకంజలో ఉంటారు అని హేళనగా నవ్వుకునే విదేశీయుల మాటలు నన్ను బాధించేవి. నా కూతురు వారి హేళనలకు సరైన సమాధానం అనిపించేది. పర్వతారోహణకు కొండ ప్రాంతాలు నడకదారి ఏవీ సవ్యంగా ఉండవు. పైగా దారిలో పాములు, విపరీతంగా గాలులు... వీటికి భయపడి స్త్రీలు ఎక్కువగా ఈ రంగంలోకి రారు. కాని వీటినేవీ లెక్కచేసేది కాదు జాహ్నవి. ప్రతికూల పరిస్థితులు ఏవైనా తట్టుకోవడం నిత్యం సాధన చేసేది. చిన్న చిన్న బరువులు మోస్తూ కొండలెక్కడం అలవాటు చేసుకుంది. యోగా, రన్నింగ్, ఫిట్నెస్లకు సంబంధించిన సాధన కూడా మొదలుపెట్టింది. తనలోని పట్టుదల చూసి చాలా ఆశ్చర్యమేసేది. భారతీయ స్త్రీలను చులకన చేసేవారికి తనే సరైన సమాధానం అని ప్రతీసారీ చేతల్లో నిరూపిస్తూనే ఉంది’’ అని కూతురి పట్టుదలను వివరించారు కృష్ణారావు. తొమ్మిదేళ్ల వయసులో... తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని 16 వేల అడుగుల ఎత్తున్న రూప్‌కుండ్ పర్వతం అధిరోహించిన జాహ్నవి ఆ తర్వాత చలికాలంలో గడ్డకట్టుకుపోయే హిమాలయాల్లో సాహసయాత్ర చేసింది. ఆ వివరాలను జాహ్నవి తెలియచేస్తూ ‘ముందు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ఇంత చిన్నవయసు అమ్మాయేంటి? అంత పెద్ద శిఖరాలేంటి? అనే ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. ఎన్నో విడతలుగా ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. లేహ్‌లో ఎంతో కష్టమైన 20 వేల అడుగుల ఎత్తున్న ‘స్టోక్ కాంగ్రీ’ పర్వతాన్ని అధిరోహించినప్పుడు నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. స్త్రీగా ఎదురయ్యే ఇబ్బందులేవీ ఇప్పటి వరకు నేను ఎదుర్కోలేదు. పైగా వాటిని జీవనశైలిలో భాగం చేసుకున్నాను. అమ్మాయిలకు ఆకాశమే హద్దుగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిలో పర్వతారోహణ ఒకటిగా నేను భావిస్తున్నాను. భయం అనే మాటకు తావు లేకుండా నేను వేసే ప్రతి అడుగు అమ్మాయిలకు స్ఫూర్తికావాలని, భారతీయ ఖ్యాతిని పెంచాలనే భావనను ఎప్పుడూ వీడను’ అని వివరించింది ఈ పిన్నవయసు పర్వతారోహకురాలు. భూమ్మీద ఎత్తై శిఖరం... త్వరలో దక్షిణ అమెరికాలో 6,962 మీటర్ల ఎత్తున్న మౌంట్ అకన్కాగ్వా పర్వతం ఎక్కడానికి సిద్ధమవుతోన్న జాహ్నవి భూమ్మీద ఎత్తయిన ఎవరెస్ట్‌తో సహా మిగతా ఖండాల్లోని పర్వత శిఖరాలన్నింటినీ అధిరోహించి ప్రపంచంలోనే అతి చిన్న వయసున్న సాహస యాత్రికురాలిగా రికార్డు సాధించాలన్న ఆశయాన్ని ఏర్పరచుకుంది. ఈ సాహస బాలిక హైదరాబాద్‌లోని రికెల్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పెయింటింగ్, కథలు రాయడం ఇష్టమని చెప్పే జాహ్నవి భరతనాట్యమూ నేర్చుకుంటోంది. ఆర్థికభారం అవరోధం... ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఆశయంతో ముందుకు అడుగువేస్తున్న జాహ్నవికి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అడ్డం పడుతున్నాయి. ఆ తపనకు ఆర్థిక ఇబ్బందులే ఊపిరి అందకుండా చేస్తున్నాయి. తండ్రి క్యాన్సర్ బారిన పడటం, సరైన స్థోమత లేని కారణంతో ఆత్మవిశ్వాసానికి పరీక్షలు ఎదురవుతున్నాయి. ఈ విషయాల గురించి జాహ్నవి తండ్రి కృష్ణారావు మాట్లాడుతూ ‘పర్వతారోహణకు అయ్యే లక్షల రూపాయల ఖర్చును ఇన్నాళ్లూ సొంతంగా భరిస్తూ వచ్చాను. ఇకపై జాహ్నవి లక్ష్యానికి ఊతం కావల్సింది సమాజమే.....’ అంటూ చేతులెత్తి విన్నవించుకున్నారు. జాహ్నవి శిఖరాగ్రం మీదకు చేరి భారతదేశ విజయకేతనాన్ని సగర్వంగా ఎగురవే యాలన్న ఆరాటానికి అంతా కలిసి ఊతమిద్దాం. - ఎన్.ఆర్ జాహ్నవి కోసం వైద్యవృత్తిని వదిలేశాను జాహ్నవి తండ్రి కృష్ణారావు చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే... ‘నా గురించి పెద్దగా చెప్పేదేమీ లేదు. వృత్తిరీత్యా ‘మెంటల్ హెల్త్’ వైద్యుడిని. నాకు కూడా సాహసక్రీడల్లో చాలా ఆసక్తి. అందుకే జాహ్నవిలో ఇలాంటి అభిరుచి పెంపొందించేలా పెంచాను. దాంతో ‘మెంటల్ డాక్టర్‌కు మెంటల్ వచ్చింది’ అని కొందరు కామెంట్స్ చేశారు. ఇక్కడ మన దేశంలో మానసిక సమస్యలను ఒక జబ్బులా చూస్తారు. కానీ నేను కెనడాలో పనిచేసే చోట దాన్ని జబ్బులా కాకుండా ఒక వేదనలా చూస్తారు. కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. హిప్నోథెరపీ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు (ఆల్టర్నేటివ్ థెరపీస్) చేస్తారు. అవేవీ ఫలితాలు ఇవ్వనప్పుడు మాత్రమే మందులు రాస్తారు. ఇక నా కూతురు జాహ్నవి విషయానికి వస్తే ఆమె కోసం నేను నా వైద్యవృత్తిని వదిలేశాను. నేను సాహసక్రీడల్లో పాల్గొనేవారిని రక్షించడం, వారికి చేయూత నివ్వడం వంటి కార్యకలాపాలకు ఆస్కారం ఇచ్చే ‘రెస్క్యూవర్’గా పనిచేస్తున్నాను. ఇక నా వ్యక్తిగత అంశాల విషయానికి వస్తే నాకు ముందుగా ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చింది. నేను ఫిట్‌గా ఉండటం, చాలా ఆరోగ్యకరంగా కనిపిస్తూ ఉండటం వల్ల లక్షణాలను గుర్తించలేదు. దాంతో అది బాగా ముదిరిపోయి నాలుగో దశకు చేరింది. వెన్నుపూసల్లోకి, కాలేయానికి కూడా పాకింది. నా గురించి, నా జబ్బు గురించి దృష్టిపెట్టడం కంటే జాహ్నవి లక్ష్యం, దాని సాధన కోసమే అందరి దృష్టి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కృష్ణారావు జాహ్నవి తండ్రి Sriperambuduru Jaahnavi AXIS Bank A/c No. 914010036210131 Dr.A.S.Rao Nagar Branch IFSC Code: UTIB0000427 జాహ్నవి ఫోన్ నంబర్: +91 8464858658 -
పిల్లలను ఎత్తుకెళుతున్నారు జాగ్రత్త!
హైదరాబాద్: కుషాయిగూడ నాగార్జున నగర్లో గురువారం ఉదయం కిడ్నాప్ అయిన నాలుగేళ్ల బాలిక జాహ్నవి దొరికింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు ఆనందించారు. పోలీసులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం ఇద్దరు మహిళలు ఉదయం 11 గంటల ప్రాంతంలో జాహ్నవికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లారు. అంబేద్కర్ నగర్‌కు సమీపంలోని బాలజీ నగర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ బాలిక చెవికి ఉన్న బంగారు కమ్మలు, మెడలోని బంగారు గొలుసు తీసుకున్నారు. జాహ్నవిని అక్కడే వదిలి పారిపోయారు. బాలిక ఏడుస్తూ అక్కడే తిరుగుతోంది. రఘు అనే వ్యక్తి ఏడుస్తున్న జాహ్నవి చూసి అప్పిపోయిందని భావించాడు. ఆ బాలికను ఎత్తుకుని దాదాపు రెండు గంటల పాటు చుట్టుపక్కల అంతా తిరిగాడు. బాలిక గురించి విచారించాడు. ఆ బాలిక తెలిసినవారు ఎవరూ కనిపించలేదు. జాహ్నవిని అడిగితే తండ్రి ఫోన్ నెంబర్ చెప్పలేకపోయింది. చివరకు కుషాయిగూడ స్కూల్లో చదువుతున్నట్లు జాహ్నవి చెప్పింది. దాంతో అతను రాత్రి 8 గంటల ప్రాంతంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి బాలికను అప్పగించాడు. జాహ్నవిని కిడ్నాప్ చేసిన వెంటనే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేయడం మొదలుపెట్టారు.మరోవైపు బాలిక బంధువులు దాదాపు 30 మంది వెతకడం మొదలుపెట్టారు. జాహ్నవి కలర్ ఫొటోలు ప్రింట్ చేయించి అందరికీ ఇస్తూ బాలిక కోసం వెతికారు. చివరకు జాహ్నవిని రఘు పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో కథ సుఖాంతమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఆనందానికి అవధులులేవు. బాలికకు బంగారు వస్తువులు పెట్టడం వల్ల ఆ మహిళలు కిడ్నాప్ చేశారు. పిల్లల ఒంటిపై బంగారు వస్తువులు పెట్టినప్పుడు జాగ్రత్త వహించాలని పోలీసులు సలహా ఇస్తున్నారు. కొందరు మహిళలు బంగారు వస్తువుల కోసం పిల్లలను తీసుకువెళుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. *** -
ఆయన నా బాధను అర్థం చేసుకుంటారా?
ఇంద్రభవనం లాంటి ఇల్లు, రాకుమారుడిలాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, ఒంటి నిండా నగలు, ఇంటి నిండా నౌకర్లు... ఏం లేదు నాకు! అన్నీ ఉన్నాయి. ఉండాల్సినదాని కన్నా ఎక్కువే ఉన్నాయి. కానీ ఉండాల్సింది ఒక్కటి మిస్సయ్యింది. మావారి ఆదరణ. అలాగని ఆయనేమీ క్రూరుడు, ప్రేమ లేనివాడు కాదు. చాలా బాగా చూసుకుంటారు. ఏ లోటూ రానివ్వరు. కానీ పట్టుమని పది నిమిషాలు ప్రేమగా దగ్గరకు తీసుకోరు. నాలుగు మాటలు సరదాగా మాట్లాడరు. కారణం... క్షణం తీరిక లేకపోవడం! ఆయన వ్యాపారి. వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. ఒక చోటి నుంచి ఇంకో చోటికి కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతారు. ఇవాళ హైదరాబాద్‌లో ఉంటే రేపు వైజాగ్‌లో ఉంటారు. ఆ తర్వాత విజయవాడ అంటారు. ఇలా తిరుగుతూనే ఉంటారు. అక్కడ ఎక్కడా పని లేనప్పుడే ఇంటికొస్తారు. వచ్చినా నిప్పుల మీద ఉన్నట్టే ఉంటారు. ఫోన్ వస్తే వెళ్లిపోవడానికి చెప్పులేసుకుని సిద్ధంగా ఉంటారు. మాక్కూడా కాస్త సమయం కేటాయించండి అంటే... ఈ కష్టమంతా నీకోసం, పిల్లల కోసమే కదా, అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ నిట్టూరుస్తారు. నిజమే. ఆయన చేసేదంతా మా కోసమేనని నాకూ తెలుసు. కానీ సంతోషంగా గడపాల్సిన సమయం చేయిజారిపోతే మళ్లీ ఆ ఆనందం దొరకదు అన్న విషయం ఆయనకు అర్థం కావడం లేదు. పిల్లల ఆటపాటలు, వాళ్ల ముద్దు మాటలు వినే తీరిక లేదు. నాతో సంతోషంగా గడిపే క్షణాలు లేవు. అవన్నీ రేపు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి! ఇప్పుడు సంపాదించినదంతా పెట్టి కొందామన్నా అప్పుడు ఏదీ దొరకదు. ఆ నిజం ఆయనకు ఎంత చెప్పినా బుర్రకెక్కడం లేదు. సంపాదించవద్దని కాదు. కావలసినంత సంపాదించారు కాబట్టి కాస్త విశ్రమించమని, విలువైన విషయాల పట్ల దృష్టి పెట్టమని, అందువల్ల కలిగే తృప్తి కోసం ఇంతవరకూ సంపాదించిన దాని పట్ల తృప్తి చెందడం మంచిదని! ఈ పరుగులో ఆయనకు ఆయనే అలసిపోయి ఆగాలి తప్ప ఆపే శక్తి నాకు లేదని అర్థమైపోయింది. నేనిక ఏమీ చేయలేను... ఆయన నా బాధను అర్థం చేసుకునే సమయం కోసం వేచి చూడటం తప్ప! - జాహ్నవి, మచిలీపట్నం -
పీక్కోవడమంటే శ్రీదేవికి పరమ చికాకు!
పిల్లలు తండ్రిని ముద్దుగా 'పప్పా' అని పిలుచుకోవడం సర్వ సాధారణం. దాదాపు అందరి ఇళ్లలో అలా పిలుచుకోవడం సహజమే.. బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ఇంట్లో కూడా ఆయన పిల్లలు జాహ్నవి, ఖుషీలు అలానే పిలుచుకుంటారు. ఇందులో ప్రత్యేకత ఏమి లేదు.. అయితే ఉన్న ప్రత్యేక అంతా బోని కపూర్ ను ఆయన భార్య, ఒకనాడు బాలీవుడ్ పై వెలుగు వెలిగిన అందాల తార శ్రీదేవి కూడా 'పప్పా' అని పిలుస్తుందంటా! శ్రీదేవి పప్పా అని పిలుచుకుని బోని ఏ పని చేసిన సహింస్తుందటా.. కాని ఒక పని చేస్తే అసలు శ్రీదేవికి ఎక్కడ లేని చిరాకేస్తుందట!. ఇంతకి అందాల తార శ్రీదేవిని బోని చిరాకు పరిచే విషయమేమిటనగా.. ఇప్పటికే జుట్టూ ఊడి పోయి అసలే బట్టతలతో కనిపించే బోని కపూర్.. వీలు చిక్కినప్పుడల్లా.. ఉన్ననాలుగు వెంట్రకల్ని కూడా పీక్కోవడం శ్రీదేవికి అసలే నచ్చదట. దాంతో వెంట్రకలు పీక్కోవడం ఆపు.. అలా పీక్కోవడం కొనసాగిస్తే.. తల మీద ఒక్క వెంట్రుక కూడా మిగలదు అని అరవడం శ్రీదేవి వంతు అవుతుందని కపూర్ కుటుంబంలోని సభ్యుడు వెల్లడించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం. -
అరవింద్‌కృష్ణ యాక్షన్.
అరవింద్‌కృష్ణ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందుతోంది. అవంతిక, జాహ్నవి కథానాయికలు. భార్గవ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎం.రంగారావు నిర్మాత. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణరాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రంగారావు క్లాప్ ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ చేయని మాస్ పాత్రను ఇందులో చేస్తున్నానని, కళాశాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అరవింద్‌కృష్ణ చెప్పారు. ‘‘నాగరాజు సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మూడు షెడ్యూళ్లను హైదరాబాద్ పరిసరాల్లో 45 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మధునందన్, బెనర్జీ, రవిబాబు, కాశీవిశ్వనాథ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజ్ ఉండ్రమట్ల, సంగీతం: మైఖేల్ మక్కల్, కూర్పు: ధర్మేంద్ర, కళ: రాము.