చరిత్ర సృష్టించిన జాహ్నవి
విశాఖ: పర్వతారోహణలో తెలుగు అమ్మాయి జాహ్నవి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు మూడు శిఖరాలను అధిరోహించిన జాహ్నవి తాజాగా, నాలుగో శిఖరం మౌంట్ డెనాలీని అమెరికాలో అధిరోహించింది. 6190 మీటర్ల ఎత్తున్న డెనాలీ.. జాహ్నవి అధిరోహించిన అతి క్లిష్టమైన శిఖరం. గతంలో కశ్మీర్ లేహ్ ప్రాంతంలోని 20 వేల అడుగుల ఎత్తున్న స్టాక్ కంగ్రి శిఖరాన్ని అధిరోహించిన 12 ఏళ్ల పిన్న వయస్కురాలిగా జాహ్నవి ఘనత సాధించింది కూడా.
మౌంట్ డెనాలిని ఇప్పటివరకూ భారత్ నుంచి ఆరుగురే అధిరోహించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య ఆమె ఆ శిఖరాన్ని అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించింది. కాగా మౌంట్ డెనాలి 20,308 అడుగుల ఎత్తుతో మౌంట్ ఎవరెస్ట్ కంటే భయంకరమైనది. 2017 ఏడాది ముగిసే లోపు ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహిస్తే ఆ ఘనత సాధించిన పిన్న వయస్కురాలి రికార్డు జాహ్నవి వశం అవుతుంది. తన ప్రయత్నం జయప్రదం అయ్యేందుకు స్పాన్సర్లు, సర్కారు చేయూత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. చదవండి... (నాన్నకు ప్రేమతో...)