ఆస్తులు అమ్మేస్తున్న శ్రీదేవి భర్త! | Boney Kapoor, Daughters Janhvi Kapoor and Khushi Kapoor Sell 4 Flats For Rs 12 Crore In Mumbai | Sakshi
Sakshi News home page

నాలుగు అపార్ట్‌మెంట్లను అమ్మేసిన శ్రీదేవి ఫ్యామిలీ!

Published Sat, Dec 23 2023 4:03 PM | Last Updated on Sat, Dec 23 2023 4:48 PM

Boney Kapoor Daughters Janhvi and Khushi Sell 4 Flats For Rs 12 Crore In Mumbai - Sakshi

సీనియర్ సినీ నిర్మాత బోనీ కపూర్, అతని కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ముంబైలోని అంధేరి శివారులో ఉన్న తమ నాలుగు అపార్ట్‌మెంట్లను విక్రయించినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో రెండు ఫ్లాట్‌లను రూ. 6.02 కోట్లకు విక్రయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్ 2 నమోదైనట్లు తెలుస్తోంది. రెండు అపార్ట్‌మెంట్‌లు లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. రెండు ఫ్లాట్ల విస్తీర్ణం 1870.57 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్‌లు ఒక ఓపెన్ కార్ పార్కింగ్‌తో వస్తాయి. ఈ రెండు ఫ్లాట్‌లను కొనుగోలు చేసినవారు సిద్ధార్థ్ నారాయణ్, అంజు నారాయణ్‌గా చెబుతున్నారు.

అదే కాంప్లెక్స్‌లో ఉన్న మరో రెండు అపార్ట్‌మెంట్‌లను వారు మరో రూ. 6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2023 అక్టోబర్ 12 న జరిగినట్లు సమాచారం. 1614.59 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్‌లు రెండు కార్ పార్కింగ్‌లతో వస్తాయి. వీటిని ముస్కాన్ బహిర్వానీ, లలిత్ బహిర్వానీలకు విక్రయించినట్లు సమాచారం.

2022లో బోనీ, జాన్వీ, ఖుషీలు 65 కోట్ల రూపాయల విలువైన బాంద్రాలో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 6421 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇందులో ఐదు పార్కింగ్‌ ప్రదేశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన అపార్ట్‌మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే..

గతంలో ఆస్తులు విక్రయించిన సెలబ్రిటీలు
సెలబ్రిటీలు ఖరీదైన ప్లాట్లను కొనుగోలు చేయడం, విక్రయించడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం నటుడు 'రణవీర్ సింగ్' ముంబైలోని ఒక లగ్జరీ టవర్‌లోని రెండు ఫ్లాట్‌లను రూ.15.24 కోట్లకు విక్రయించాడు. నవంబర్‌లో నటి 'ప్రియాంక చోప్రా' ఓషివారాలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో 2,292 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను రూ. 6 కోట్లకు విక్రయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement