పీక్కోవడమంటే శ్రీదేవికి పరమ చికాకు!
పిల్లలు తండ్రిని ముద్దుగా 'పప్పా' అని పిలుచుకోవడం సర్వ సాధారణం. దాదాపు అందరి ఇళ్లలో అలా పిలుచుకోవడం సహజమే.. బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ఇంట్లో కూడా ఆయన పిల్లలు జాహ్నవి, ఖుషీలు అలానే పిలుచుకుంటారు. ఇందులో ప్రత్యేకత ఏమి లేదు.. అయితే ఉన్న ప్రత్యేక అంతా బోని కపూర్ ను ఆయన భార్య, ఒకనాడు బాలీవుడ్ పై వెలుగు వెలిగిన అందాల తార శ్రీదేవి కూడా 'పప్పా' అని పిలుస్తుందంటా!
శ్రీదేవి పప్పా అని పిలుచుకుని బోని ఏ పని చేసిన సహింస్తుందటా.. కాని ఒక పని చేస్తే అసలు శ్రీదేవికి ఎక్కడ లేని చిరాకేస్తుందట!. ఇంతకి అందాల తార శ్రీదేవిని బోని చిరాకు పరిచే విషయమేమిటనగా..
ఇప్పటికే జుట్టూ ఊడి పోయి అసలే బట్టతలతో కనిపించే బోని కపూర్.. వీలు చిక్కినప్పుడల్లా.. ఉన్ననాలుగు వెంట్రకల్ని కూడా పీక్కోవడం శ్రీదేవికి అసలే నచ్చదట. దాంతో వెంట్రకలు పీక్కోవడం ఆపు.. అలా పీక్కోవడం కొనసాగిస్తే.. తల మీద ఒక్క వెంట్రుక కూడా మిగలదు అని అరవడం శ్రీదేవి వంతు అవుతుందని కపూర్ కుటుంబంలోని సభ్యుడు వెల్లడించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం.