
Jr NTR Emotional Letter To RRR Team On Movie Success: ‘‘నా కెరీర్‌లో ఓ ల్యాండ్ మార్క్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమాలో భాగమైన అందరికీ, రిలీజ్ అయిన దగ్గర్నుంచి ప్రేమ, ప్రశంసలు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అంటూ మంగళవారం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా తన మనోభావాలను ఈ విధంగా వ్యక్తపరిచారు. ‘‘నటుడిగా నేను నా ‘బెస్ట్’ ఇవ్వడానికి నన్ను ఇన్‌స్పయిర్ చేసినందుకు థ్యాంక్యూ జక్కన్నా (రాజమౌళిని ఉద్దేశించి). నాలోని బెస్ట్‌ని బయటకు తెచ్చి నన్ను నేను నీటి (‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఎన్టీఆర్ పాత్రను నీళ్లతో పోల్చారు రాజమౌళి)లా భావించేలా చేశారు’’ అన్నారు ఎన్టీఆర్.
రామ్‌చరణ్‌ని ఉద్దేశించి.. ‘‘నువ్వు లేకుండా నేను ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నటించడాన్ని ఊహించుకోలేకపోతున్నాను. అల్లూరి సీతారామరాజు పాత్రకు నువ్వు తప్ప వేరే ఎవరూ న్యాయం చేయలేకపోయేవారు. అలాగే నువ్వు లేకుండా భీమ్ (ఎన్టీఆర్ పాత్ర) పాత్ర అసంపూర్ణంగా ఉండేది’’ అని ఎన్టీఆర్ ప్రశంసించారు.
ఇంకా రచయిత విజయేంద్ర ప్రసాద్, నిర్మాత దానయ్య, నటీనటులు ఆలియా భట్, అజయ్ దేవగన్, సంగీతదర్శకుడు కీరవాణి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిరంతరం సపోర్ట్ చేస్తూ, ప్రేమాభిమానాలు కనబరుస్తున్న తన ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పి, ‘‘ఇక ముందు కూడా మిమ్మల్ని ఇలానే ఎంటర్‌టైన్ చేస్తా’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్చి 25న విడుదలైన కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ థియేటర్లలో అదరగొడుతోంది. కేవలం మూడు రోజల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి రికార్డుని తిరగరాసింది.
I’m touched beyond words… pic.twitter.com/PIpmJCxTly
— Jr NTR (@tarak9999) March 29, 2022