Sonali Bendre Open Up On How She Struggled With Cancer: మురారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనాలి బింద్రే. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. అంతేకాదు 2018లో ఆమె క్యాన్సర్ బారిన పడిన ఆమె న్యూయార్క్‌లో చికిత్స అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి క్యాన్సర్‌పై అవగాహాన కల్పించేందుకు స్వీయఅనుభవాలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె క్యాన్సర్‌తో తను చేసిన పోరాటాన్ని, ఈ మహమ్మారి తన జీవితాన్ని ఎలా మార్చేసిందో గుర్తు చేసుకున్నారు.
చదవండి: ముంబైలో కరణ్ బర్త్‌డే పార్టీ.. విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం!
క్యాన్సర్ వ్యాధి పోతూ తనకు 23 ఇంచుల సర్జరీ మచ్చను వదలేసిందని తెలిపింది. ‘క్యాన్సర్ బారి పడి కోలుకున్న వారి జీవితాలు.. క్యాన్సర్‌కు ముందు.. క్యాన్సర్‌కి తర్వాత అన్నట్టుగా ఉంటుంది. మనిషి తన జీవితంలో ఎదురైన సమస్యల నుంచి ఎదోక గుణపాఠం నేర్చుకుంటాడు. ఈ క్యాన్సర్ వ్యాధి తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. అయితే దీని నుంచి నువ్వు ఏం నేర్చుకోలేదు అంటే నిజంగా అది బాధకరమైనది అవుతుంది. ఈ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న ఆ రోజులు నా జీవితంలో అత్యంత కఠినమైనవి. దీని వల్ల మన శరీరంలో వచ్చే మార్పులను స్వీకరించడం చాలా కష్టం.
చదవండి: లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి
ఇక క్యాన్సర్ వ్యాధితో చికిత్స తీసుకున్న నాకు నా శరీరంపై 23-24 ఇంచుల గాయం గుర్తు మిగిలిపోయింది. అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక గోల్ కాదు. కానీ ఈ సమయంలో జరిగే ప్రక్రియ, ప్రయాణం అనేది చాలా ముఖ్యం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమె త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో సోనాలీ బింద్రె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment