![Vijay Sethupathi Fulfills The Wish Of A Cancer Patient - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/26/sethupathi.jpg.webp?itok=uylYhtjA)
చెన్నై: మొన్న మెదడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కెనడాకు చెందిన అభిమానితో నటుడు కమల్‌హాసన్ జూమ్ కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా నటుడు విజయ్ సేతుపతి క్యాన్సర్ బారిన పడిన చిన్నారిని అక్కున చేర్చుకుని మనోబలాన్ని పెంచారు. క్యాన్సర్ వ్యాధికి గురైన ఒక చిన్నారి నటుడు విజయ్ సేతుపతిని దగ్గరగా చూడాలన్న కోరికను వ్యక్తం చేశాడు.
ఈ విషయాన్ని తన అభిమాన సంఘం నిర్వాహకుల ద్వారా తెలుసుకున్న విజయ్ సేతుపతి ఆ బాలుడిని, అతని కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించి మాట్లాడారు. బాలుడిని గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలుడి వివరాలు తెలియకపోయినా ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విజయ్‌సేతుపతి మానవత్వాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
చదవండి : అభిమానికి బ్రెయిన్ క్యాన్సర్: ధైర్యం చెప్పిన కమల్
Comments
Please login to add a commentAdd a comment