ఆమె చివరికోరిక నెరవేర్చేందుకు.. | this Cancer patient’s last wish is to meet Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

ఆమె చివరికోరిక నెరవేర్చేందుకు..

Published Fri, Oct 20 2017 1:37 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

this Cancer patient’s last wish is to meet Shah Rukh Khan - Sakshi

ఆమె ఒక క్యాన్సర్‌ పేషంట్‌. ఆమె చివరికోరికను నెరవేర్చేందుకు ఇప్పుడు నెటిజన్లు నడుం బిగించారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ను కలువాలన్న ఆమె జీవితకాల ఆకాంక్షను సాకారం చేసేందుకు.. ఏకంగా ఎస్‌ఆర్కేమీట్స్‌అరుణ్‌ (#SRKMeetsAruna) యాష్‌ట్యాగ్‌ను ఇప్పుడు వైరల్‌గా మార్చారు. ఆమె ఫొటోతోపాటు షారుఖ్‌ను ఆమె కలిసినట్టు ఉన్న స్కెచ్‌ను కలిపి ట్వీట్‌చేస్తూ.. షారుఖ్‌ దృష్టికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అరుణ పీకే ప్రముఖ నెటిజన్‌ అని చెప్పాలి. భారత్‌లోని వివిధ రాష్ట్రాల ప్రజలకు తనకు ఎందుకు నచ్చుతారో పేర్కొంటూ ఆమె గత జూలైలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. అరుణ ధైర్యవంతురాలు. చాలా సానుకూల దృక్పథం కల వ్యక్తి. తన చుట్టు ఉన్న వారిలో నిత్యం ఉత్సాహం నింపే ఆమె ఈ మార్చి నాటికి క్యాన్సర్‌పై పోరాటంలో ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధిపై పోరాడుతూ.. ధైర్యంగా ముందుకు సాగుతున్న ఆమె.. ఈ సందర్భంగా వైద్యులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు రుణపడి ఉంటానని అన్నారు. అదేవిధంగా తన అభిమాన నటుడు షారుఖ్‌ఖాన్‌ తనలో శక్తిని నింపుతున్నారని, ఈ విషయం ఆయనకు తెలిసి ఉండకపోవచ్చునని ట్వీట్‌ చేశారు. 'షారుఖ్‌పై ఉన్న ప్రేమ కన్నా మరేది గొప్పది కాదు..ఒకవేళ నేను ఆయనను కలిస్తే.. నేను బాగుంటాను' అంటూ అరుణ పేర్కొన్నట్టు కామెంట్లు పెట్టి.. నెటిజన్లు ఈ పోస్టును వైరల్‌ చేశారు. త్వరగా షారుఖ్‌ ఆమెను కలువాలని కోరుకుంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement